భక్తుని మొర… పులిజాల కవిత్వం

భక్తునిమొర

తిరుమల శ్రీ శ్రీనివాస

చిన్మయ చిద్విలాస

శరణంటి నో దేవా!

కరుణించి కాపాడ రావా!

ఏడుకొండల పైన

వెలిగేటి ఓ స్వామి

ఏడు ద్వారములు దాటి

వేచి యున్నానయ్యా

అభయమొసంగి నన్ను

ఆధరించవయ్యా స్వామి “తిరు”

ఒక్కొక్క మెట్టున

ఎన్ని మొక్కులో నీకు

ఒక్కొక్క అడుగున

ఎన్ని గోవిందాలో

ఏ రాయి నాతిగా

నీ రూపుదాల్చునో యని

వంగొంగి దండాలు

చేశానయ్యా శ్రీ శ్రీనివాస “తిరు”

ఏ పుట్టలో దాగితివోయని

పుట్ట పుట్టను

పట్టి పట్టి వెతికితినయ్యా

ఏ భక్తుని చెంత చేరితివో యని

భక్తు భక్తుని జేరి

కొలిచేను స్వామి

కరుణించి అగుపించవయ్యా “తిరు’

ఇరువురి దేవేరుల

ముచ్చటైన స్వామి

ఓకరి అలక తీర్చ

మౌని వైనావేమి స్వామి

నా మొర విని

కాపాడుమయ్య శ్రీ శ్రీనివాస ” తిరు’

ఆపదమొక్కులవాడ

ఓ శ్రీనివాస

ప్రతి ఆపద తొలి ముడుపు

నీకే నయ్య స్వామి

వడ్డికాసులవాడ

ఓఅనాధరక్షకా

శ్రీ తిరుమలేశా దేవా!

ఎత్తిన కరములు

దించక కొలిచేను స్వామి

తిరుమల శ్రీ శ్రీనివాస!

చిన్మయ శ్రీ చిద్విలాస!

శరణంటి నో దేవా!

కరుణించి కాపాడరావా దేవా!!

–🙏 పులిజాల.(92465 28339)

విద్యార్థులకు ప్రియమైన మాస్టారు కిష్టయ్య

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎడ్యుకేషన్ లెక్చరర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా సమర్థుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు లెక్చరర్ కిష్టయ్య వేలాదిమంది డిఈడీ, బిఈడీ, టీపీటీ విద్యార్ధులు తెలుగు పండిట్లయ్యేందుకు కారణమయ్యారు. విద్యార్ధులను అమితంగా ప్రేమించి… వారు జీవితంలో స్థిరపడేందుకు అన్నివిధాలా సహకరించే మనస్తత్వం ఆయనది. గాయకుడు కూడా కావడంతో తరగతి గదుల్లో కిష్టయ్య సార్ జానపదాలను విద్యార్ధులు తెగ ఎంజాయ్ చేసేవారు. నిలువెల్లా మధురత్వాన్ని నింపుకున్న కిష్టయ్య సార్ క్లాసుల కోసం విద్యార్థులు ఉత్సాహంగా ఎదురుచూసేవారు. విద్యార్థులకు ప్రియమైన మాస్టారైన కిష్టయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిత్వం రాయడంలోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. కిష్టయ్య రాసిన కవిత్వాలు, రచనలు ఈక్షణం పాఠకులకు ప్రత్యేకం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*