
హైదరాబాద్: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్(జీసీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎన్ఎమ్డీసీ గ్రేస్ క్యాన్సర్ రన్ ప్రపంచంలోని ఆరు ఖండాలకు చేరనుంది. క్యాన్సర్ నివారణలో భాగంగా ఈ రన్ నిర్వహించనున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. రన్నర్లు 150కు పైగా దేశాలలో క్యాన్సర్‌పై అవగాహన కలిగించనున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ స్ఫూర్తిని నింపనున్న ఎన్ఎమ్డీసీ గ్రేస్ క్యాన్సర్ రన్ నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ క్యాన్సర్‌ను గుర్తించడం, అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ రన్ నిర్వహించనున్నారు.
గతేడాది నిర్వహించిన రన్లో 119 దేశాల నుంచి 50 వేల మంది పాల్గొన్నారు. దీనికి రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు కూడా దక్కాయి. అయితే ఈ ఏడాది అంతకుమించి పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో గతేడాది రికార్డులను కూడా అధిగమించే అవకాశముందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. 2021 అక్టోబర్ 10న ఈ రన్‌ను నిర్వహించనున్నారు. ఇది హైబ్రిడ్ ఫార్మాట్లో జరగనుంది. ఈ రన్లో పాల్గొనాలనుకునేవారు వర్చువల్ లేదా ఫిజికల్ విధానంలో పాల్గొనే సౌలభ్యం కల్పించడం జరిగింది.
This post is also available in : English
Be the first to comment