భాగ్యనగరంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అనేక కాలనీలు బస్తీల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. సరూర్ నగర్ లింగోజిగూడ డివిజన్‌లోని తపోవన్ కాలనీలో శ్రీ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఐదవ రోజు గణేశునికి పూజ, భారీ స్థాయిలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. మల్లేష్ యాదవ్, యశ్వంత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అతిథులుగా జిట్టా సురేందర్రెడ్డి, అఖిల్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, గట్టు రవి విచ్చేశారు.

సరూర్ నగర్ యూత్ క్లబ్ గణనాథుడికి ఘనంగా పూజలు జరిగాయి. సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ కుమార్, రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు, గట్టు రవి వినాయకుడి పూజలో పాల్గొన్నారు.

లింగోజిగూడ సాయినగర్ కాలనీలోనూ వినాయకుడికి ఘనంగా పూజలు చేశారు.

భాగ్యనగరంలో కొన్ని చోట్ల ఇప్పటికే నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. పిల్లలు, పెద్దలు అందరూ గణపతి బప్పా మోరియా, అగ్‌లే బరస్‌తూ జల్దీ ఆ అంటూ వినాయకుడికి వీడ్కోలు చెబుతున్నారు.

మకర్ల వెంకట కుమార్, సరూర్‌నగర్ (7981702218)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*