శంషాబాద్ షెహర్ కా… షేర్! దిద్యాల శ్రీనివాస్!

ఘనమైన ఉద్యమాల శ్రీనివాస్

రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి సరైన నాయకుడు దిద్యాల శ్రీనివాస్! 

 

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దతుప్పర గ్రామానికి చెందిన దిద్యాల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో క్రియాశీలంగా మారారు. పార్టీ నాయకుడిగా మండల, జిల్లా పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో సత్సంబంధాలు కలిగున్న శ్రీనివాస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పిలుపు మేరకు అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఏ పిలుపు నిచ్చినా, ఏ పథకాలు ప్రవేశపెట్టనా వాటి అమలుకు నిర్విరామంగా కృషిచేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల నాయకులతో కలిసి, పార్టీ కార్యకర్తలను కలుపుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. కష్టపడి కింది స్థాయి నుంచి పైకి ఎదుగుతూ వచ్చిన శ్రీనివాస్ తొలుత, ఫర్టిలైజర్ వ్యాపార రంగంతో పాటు రియల్ ఎస్టేట్, వైద్య రంగంలో లిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గ్రూప్స్ ద్వారా మహేశ్వరం, ఇబ్రహీం పట్నం, షాద్ నగర్, చేవెళ్ల మరియు రాజేంద్ర నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో వైద్య సేవలు అందించారు. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద తుంపర నుంచి జనరల్ కోటాలో ఎంపీటీసీగా తన భార్యయైన జయమ్మను గెలిపించుకున్నారు.

రాష్ట్ర జనాభాలో 5వ స్థానంలో ఉన్న రజక సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు ఎవ్వరికీ పదవుల్లేవు. రజక సంఘంలో రాష్ట్ర కార్యవర్గంలో ఉండి శంషాబాద్‌లో జాతీయ రజక ఆర్గనైజేషన్స్ మహా సమ్మేళనం జరపడంలో శ్రీనివాస్ ప్రముఖ పాత్ర పోషించారు.రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ సారి శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. అన్ని వర్గాలను కలుపుకుపోయే స్వభావం ఉన్న నేత కావడంతో శ్రీనివాస్ పార్టీ బలోపేతానికి తోడ్పడే అవకాశం ఉందంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*