సెల్ఫీ విత్ వృషభ క్యాంపెయిన్ షురూ! బెస్ట్ సెల్ఫీలకు గిఫ్ట్‌లు: కృషిభారతం

వృషభాలతో సెల్ఫీ దిగి 8686743452 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలి

www.eekshanam.com: కృషిభారతం ఆధ్వర్యంలో నవంబర్ ఐదున జరగనున్న వృషభోత్సవం సందర్భంగా సెల్ఫీ విత్ వృషభ క్యాంపెయిన్ ప్రారంభమైంది. రైతన్నలు, గో ప్రేమికులు తమ వృషభాలతో సెల్ఫీ దిగి 8686743452 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ సూచించారు. సెల్ఫీలు పంపే వారు తమ పేరు, గ్రామం, మండలం, జిల్లా, అడ్రస్ వివరాలు స్పష్టంగా రాసి పంపాలి.  బాగా వచ్చిన సెల్ఫీలకు బహుమతులు కూడా ఇస్తామని కౌటిల్య ప్రకటించారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌లు కూడా పంపిస్తామన్నారు.

మరోవైపు నవంబర్ 5న తెలుగు రాష్ట్రాలతో పాటు వివిద దేశాల్లో జరగనున్న వృషభోత్సవానికి కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మద్దతు తెలిపారు. వృషభోత్సవం పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ప్రతి ఏటా కార్తీక శుద్ధ పాడ్యమి నాడు వృషభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అని, వేద వ్యవసాయ పండుగల్లో వృషభోత్సవం అతి ముఖ్యమైనదని కౌటిల్య తెలిపారు. దేశవాళీ వృషభాల ప్రాధాన్యతను ప్రస్తుత తరాలకు తెలియజేయడమే కాక గో సంతతిని కాపాడుకునే లక్ష్యంతో వృషభోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.

బసవ, పరాశర, పరశురామ, కశ్యప, వశిష్ట, బలరాముడు తదితరులు గతంలో వృషభాన్ని పూజించారని కౌటిల్య గుర్తు చేశారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా వృషభోత్సవాన్ని తమ మఠాలు, పీఠాలు, ఆశ్రమాల్లో నిర్వహించేందుకు అనేక మంది స్వాములు ముందుకొచ్చారు. అనేక దేవాలయాలు, గోశాలల్లో కూడా వృషభపూజ, వృషభయాత్ర నిర్వహించనున్నారు. రైతన్నలు కూడా వృషభోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమౌతున్నారు. మరిన్ని వివరాలకు కృషి భారతం కార్యాలయాన్ని (86867 43452) సంప్రదించాలని కౌటిల్య తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*