
హైదరాబాద్: రష్యా, చైనాలో ఊహించని విధంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రష్యాలో కొత్తగా 39,930 కేసులు నమోదయ్యాయి.
వెయ్యి మందికి పైగా మృతిచెందారు. రష్యాలో ఇప్పటి వరకు 8.2 మిలియన్ల కేసులు నమోదయ్యాయి. 2,31,669 మంది కరోనాకు బలయ్యారు. ప్రపంచ కరోనా మరణాల్లో రష్యా 5వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు కేవలం 45 మిలియన్ మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 30 నుంచి నవంబర్ 30 వరకు సెలవులను ప్రకటించారు. భవిష్యత్తులో పరిస్థితి మెరుగు పడకపోతే ఇంకా దానిని అలాగే కొనసాగిస్తామని ప్రకటించారు. చైనాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విదేశాల నుంచి వచ్చిన “డెల్టా” వేరియంట్ తాజా వ్యాప్తికి కారణమని, రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరుగుతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 171 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 122 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 567 మందికి కోవిడ్ సోకింది. 437 మంది కోలుకున్నారు.
వాక్సినేషన్లో భాగంగా భారత్లో ఇప్పటివరకూ 104 కోట్ల 73 లక్షల వ్యాక్సిన్లు వేశారు.
-బానవత్ వినోద్, హైదరాబాద్.
Be the first to comment