
హైదరాబాద్: సోషల్ మీడియా అనే పదం అందరికీ సుపరిచితమే. తెలియని వారు ఉండరు. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న సమాజంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కన్నా సోషల్ మీడియా మొదటి స్థానంలో ఉంది. అందరూ సోషల్ మీడియాలో మునిగి ఉన్నారు.
ప్రయోజనాలు:
ప్రతి విషయాన్ని మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ప్రజలకు సమాచారం త్వరగా అందుతుంది. సమాజంలో తెలియని విషయాలు ఎన్నో దీని ద్వారా తెలుస్తున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలు, సినిమా, రాజీకీయలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య మరియు వైద్యం మొదలైన ఎన్నో రంగాలలో ఉన్న ప్రతి విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది.
ప్రతికూలతలు:
ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల, పోస్ట్ చేసిన విషయం నిజమా! కాదా! అనే మరో ఆలోచన లేకుండా షేర్ చేస్తున్నారు. ఖచ్చితమైన (పనికి వచ్చే) సమాచారం కంటే పనికి రాని పోస్ట్ లు ఎక్కువగా సోషల్ మీడియా లో దర్శనం ఇస్తూన్నాయి. సోషల్ మీడియాను అవసరాన్ని బట్టి పరిమితంగా వాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సమయం వృధా చేసుకోకుండా, అవసరమైన సమాచారం తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
– సిచ్. నిఖిత, హైదరాబాద్
https://www.facebook.com/nikhitha.chippa
This post is also available in : English
Be the first to comment