ఈసారి టీ20 వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారంటే?

హైదరాబాద్: ప్రపంచ టీ20 వరల్డ్ కప్ క్రికెట్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇటీవల జరిగిన గ్రూప్ బి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. భారత జట్టు ఏ జట్టుతోనైనా గెలుస్తుందని అంతా భావించారు. కానీ పాకిస్తాన్ జట్టు భారత్, కివీస్‌ను అలవోకగా ఓడించింది. దీంతో పాకిస్థాన్ జట్టుకి సెమీస్ లోకి వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి.

మరోవైపు భారత్ తదుపరి మ్యాచ్ గనుక గెలిస్తే సెమీస్ చేరినట్టే అని భావిస్తోంది. తరువాత జరగబోయే మ్యాచ్‌లన్నీ అలవోకగా గెలిచేస్తారు అనే ధీమా ఉంది. భారత్, కివీస్ లకి ఆదివారం జరిగే మ్యాచ్ ఆత్యంత కీలకంగా మారబోతోంది. ఎవరు ఓడినా సెమీస్‌లోకి వెళ్లే అవకాశాలు తక్కువౌతాయి. దీంతో ఈ మ్యాచ్‌ కోసం భారతీయ అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

మరో వైపు ఏ గ్రూప్‌లో ఇంగ్లాండ్ తమ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. దీంతో పాటు ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా కూడా తమ సెమీస్ అవకాశాలను సద్వినియోగం చేసుకోడానికి బలంగానే ప్రయత్నం చేస్తున్నాయి.

మిగిలిన టీమ్స్ అన్నింటికి కూడా సెమీస్ అవకాశాలు చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు.

తాజా పెర్‌ఫార్మన్స్‌ను బట్టి ఇంగ్లాండ్ పాకిస్థాన్, భారత జట్లలో ఎవరో ఒకరు ఈసారి కప్ గెలుస్తారు అని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు.

Kenna, Rachana Journalism College, Hyd

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*