
హైదరాబాద్: పబ్జీ మోబైల్ సీక్వెల్ పబ్జీ న్యూ స్టేట్ ను ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లలో అందుబాటు లోకి తెచ్చింది దక్షిణ కొరియా కి చెందిన గేమింగ్ సంస్థ క్రాఫ్టన్. ఈ వీడియో గేమ్ భారత్ లోనూ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తక్షణమే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ యాపిల్ యూజర్స్ మాత్రం ఇంకాస్త సమయం వేచిచూడాలి.
17వేర్వేరు భాషల్లో ఈ వీడియో గేమ్ అందుబాటులో ఉంటుందని తెలిపిన క్రాఫ్టన్ ఐఓఎస్ లాంచ్ ఆలస్యానికి కారణం చెప్పలేదు. 2051 బాక్ డ్రాప్ తో ఈగేమ్ వస్తుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గేమ్ డౌన్లోడ్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్
ఆండ్రాయిడ్ ఫోన్లలో 2జిబి రెమ్ (ram) 64బిట్ సిపీయు ఆండ్రాయిడ్ వెర్షన్ 6.0 లేదా అంత కన్నా ఎక్కువ.
ఐఓఎస్ విషయానికొస్తే వెర్షన్ 13 అంతకన్నా ఎక్కువ ఉండటం తప్పని సరి. రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ లో 1.4 జిబి స్టోరేజ్ తో ఈ గేమ్ వస్తుంది.
Be the first to comment