
ఢిల్లీ: రోడ్ల పక్కనున్న చెట్లని అడవిగా పరిగణించలేమన్న కమిటీ సిఫార్సులను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అడవి అనే నిర్వచనాన్ని అడవిగా గుర్తించని భూమి పై నాటిన చెట్లకి వర్తింపజేస్తే, రోడ్ల పై చెట్లు నాటడాన్ని నిరుత్సాహ పరిచినట్లేనని సుప్రీం కోర్టు నియమించిన ఒక కమిటీ అభిప్రాయపడింది.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరషన్(డీఎంఆర్సీ), ఫేజ్-4 మెట్రో విస్తరణ కోసం 10,000 చెట్లను కొట్టేయడానికి ఈ కమటీ చేసిన సిఫార్సులను ఉటంకిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ను పరిశీలిస్తున్న జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు, జస్టిస్ బి.ఆర్. గవయ్, జస్టిస్ నాగరత్న లతో కూడిన ధర్మాసనం
“నాటిన చెట్లన్నింటినీ అడవి కాదనటాన్ని మేము అంగీకరించలేము. ఇది చాలా గందరగోళానికి దారి తీస్తుంది. మొక్క నాటినదా..? లేక సహజంగా పెరిగిందా అన్నది ఎవరు నిర్ధారిస్తారు?” అని ప్రశ్నించింది.
కమిటీ తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఏడీఎస్ రావు ప్రాజెక్టు సంబంధిత భూమిలో పెరిగిన చెట్లని అడవిగా పరిగణించలేమని 1996లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడే కమిటీ ఈ నిర్ణయానికి వచ్చిందన్నారు.భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అడవుల బయట పెంచిన చెట్లకు ఫారెస్ట్(కన్సర్వేషన్) యాక్ట్ 1980 వర్తించదు. సహజంగా పెరిగిన చెట్లకు మాత్రమే వర్తిస్తుంది కనుక కమిటీ ఈ సిఫార్సులను చేసిందని తెలిపారు.
Be the first to comment