ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో అరబిందో 150వ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో అరబిందో 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 14న ప్రత్యేకంగా జర్నలిస్టుల కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉదయం 9:30 నుంచి 1:30 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. స్వామి వివేకానంద స్ఫూర్తితో స్వాతంత్ర్య ఉద్యమంలో దేశ ప్రజలను తన బోధనలు, కార్యాచరణతో ఎంతగానో ప్రభావితం చేసిన శ్రీ అరబిందో గురించి మరెన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు అరుదైన అవకాశం ఇదని నిర్వాహకులు తెలిపారు. జర్నలిస్ట్ మిత్రులందరూ స్ఫూర్తి పొందాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ టీమ్ తెలిపింది.

హైదరాబాద్ రామకృష్ణ మఠానికి చెందిన స్వామి శితికంఠానంద అనుగ్రహ భాషణంతో కార్యక్రమం ప్రారంభం కానుంది. సీనియర్ జర్నలిస్టులు గోపరాజు నారాయణ రావు, వల్లీశ్వర్, అరబిందో సొసైటీకి చెందిన ములుగు శ్రీనివాస్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్ రెడ్డి, తదితరులు ప్రసంగిస్తారు. జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ టీమ్ పిలుపునిచ్చింది.

 

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*