Delhi pollution: ఢిల్లీ లో వారం పాటు పాఠశాలల మూసివేత

రోజురోజూకీ ఢిల్లీ కాలుష్యం పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయాలు..

ఢిల్లీ: కాలుష్యం పెరిగిపోతొండటంతో ఈ సోమవారం నుంచి వారం రోజుల పాటు పాఠశాలలు మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నెల 14-17 వరకు నిర్మాణాలను నిలిపివేయనున్నట్లు, ప్రభుత్వ ఉద్యోగులు 100 శాతం ఇంటి నుంచి పని చేస్తారని, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులను కూడా వీలైనంత మేర ఇదే పద్దతిలో పని చేయించాలని యాజమాన్యాలను కోరామని కేజ్రీవాల్ తెలిపారు.

పక్క రాష్ట్రాల్లో పొలాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతుందని, పూర్తి లాక్డౌన్ పై త్వరలోనే సుప్రీం కోర్టు కి నివేదిక సమర్పిస్తాము. ఇది పెద్ద నిర్ణయం కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*