
5G…ఇప్పుడు ఉన్న స్మార్ట్ ఫోన్ రంగంలో ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. దానికి ఉన్న క్రేజ్ ని తీసుకొని ఉన్న స్మార్ట్ ఫొన్ కంపెనీలు విరివిగా మొబైల్స్ ని లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో అడ్డంకులు ,సవాళ్ళను దాటిన 5G యొక్క పరీక్ష (టెస్ట్స్)లను మన భారత దేశంలో ప్రారంభించారు.
5G వినియోగంలోకి వస్తే ఇప్పుడు 4Gలో 200-300 mbps లో ఒక సినిమా డౌన్లోడ్ చేసుకోవడానికి పట్టే సమయం 6 నిమిషాలు అనుకుంటే, అదే 5G లో మాత్రం 1-10 gbps లో 3.6 నిమిషాలు పట్టే అవకాశం ఉంది.
అభివృద్ది చెందిన దేశాలలో ఎప్పుడో ప్రారంభం అయిన 5G, మన దేశానికి వచ్చేసరికి చాలా సమయం పట్టేలా ఉండి. 2020 నుండి ఊరిస్తూ వస్తున్న 5G, 2021 నాటికి మద్యలో అయినా వస్తుంది అనుకుంటే అది కాస్తా 2022 ఆఖరికి చేరుకుంది. దీనికి సంబంధించి మన దేశ IT మినిష్టర్ అశ్వినీ వైష్ణవ్ 5G గురించిన ఆక్షన్ ని దిగ్గజ కంపెనీలు తీసుకున్నాయి,వాటి యొక్క టెస్టింగ్ జరుగుతుంది అని చెప్పారు. పక్క దేశాలలో 6G గురించిన పరీక్షలు జరుగుతున్నా మన దేశంలో మాత్రం 5G గురించిన పనులు నత్త నడకగానే సాగుతున్నాయి.
-K.Bharath (rachana college)
Be the first to comment