ధర్నా దగ్గర చేసింది

గత కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఇద్దరి వ్యక్తుల మధ్య వాతావరణం చాలా వాడి వేడిగా కొనసాగింది.వాళ్ళు ఎవరో కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు రేవంత్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పెరు ఖరారు చేసిందో ఆరోజే కోమటిరెడ్డి చేసిన విమర్శలు అంత ఇంత కాదు.అప్పటినుండి కాంగ్రెస్ చేప్పట్టిన ఏ కార్యక్రమం లో అయిన కానీ కోమటిరెడ్డి హాజరు కాలేదు కనీసం గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కబోను అన్నారు. ఇక అందరూ కోమటిరెడ్డి పార్టీ వీడుతారు అని ఎన్నో ఊహాగానాలు వ్యక్తం చేశారు.ఇక వీళ్లు ఇద్దరు కలవడం కష్టతరమే అని భావించారు.మతి ఈరోజున  కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరి దీక్ష కార్యక్రమం ఇందిరా పార్కు దెగ్గర జరిగింది,అయితే ఆ దీక్షకు కోమటిరెడ్డి రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. కోమటిరెడ్డి మరియు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే తాటిపై కలవడం కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లోనూ కార్యకర్తల్లోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపింది. మరి ఇద్దరు ఒకటే అయ్యారో లేక రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్ని కాంగ్రెస్ పార్టీ లో కానబడతాయో చూడాల్సిందే.

Kenna, Rachana College of Journalism

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*