
కొన్ని రోజుల క్రితం తెలంగాణ లో జరిగిన హుజురాబాద్ ఉపఎన్నిక ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచాడు.ఈ గెలుపు ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం జరిగింది అన్నది చూస్తే మాత్రం,మొదటిగా బీజేపీ పార్టీ జరిగిన మూడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి రెండు సీట్లను గెలుచుకుంది, దీంతో ఆ పార్టీకి మాత్రం చాలా లాభన్ని చేకూర్చినట్టే. ఇక అధికార పార్టీకి మాత్రం కాస్త నష్టం అనే చెప్పుకోవచ్చు,ఎందుకంటే కేసీఆర్ పైన కానీ అధికార పార్టీ పైన కావొచ్చు కానీ తీవ్ర వ్యతిరేకత మాత్రం ప్రజలల్లో బాగానే కనపడుతుంది అనేది వచ్చిన ఫలితాన్ని బట్టి చూడొచ్చు.బీజేపీ గెలిచిన కూడా రెండో స్థానం మాత్రం టీఆరెస్ కె దక్కింది. కానీ జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభావం మాత్రం కొంచెం కూడా చూపెట్టలేక పోయింది.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దుకూడు మాత్రం అంతా ఇంతా కాదు.రేవంత్ రెడ్డి కి పార్టీ బాధ్యతలు అప్పగించినప్పటినుండి కాంగ్రెస్ పార్టీ మంచి బలంగా కనపడింది వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయంవంతం అవ్వడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఆసక్తిని పెంచింది.మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు జరగాల్సింది ఉండగా తెలంగాణాలో రాజకీయలు మాత్రం కత్తి మీద సాము లానే ఉండబోతున్నాయి అనేది మాత్రం వాస్తవం.
Kenna, Hyderabad
Be the first to comment