అలా మొదలయింది

భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సిరీస్ యొక్క 2వ టెస్ట్ ముంబై వాన్ఖేడే స్టేడియంలో ప్రారంభం అయింది.మొదటి రోజు వాతావరణం అనుకూలించక  కాస్త ఆలస్యంగా మొదలైన మ్యాచ్  మొదటి సెషన్ పూర్తిగా క్యాన్సల్ అయింది.ఇక మధ్యాహ్నం 12 గంటలకు టాస్ అవడంతో టాస్ గెలిచి బ్యాటీంగ్ దిగిన భారత్  మొదట్లో గిల్ బౌండరీలతో మంచి ఉత్సాహాన్ని ప్రదర్శించాడు,అగర్వాల్ కాస్త అలస్యంగానే మొదలెట్టాడు.గిల్ మధ్యలో వెనుదిరగడంతో  బ్యాట్టింగ్ కు వచ్చిన పుజారా గ్రీసులో ఎక్కువ సమయం నిలదొక్కుకోలేకపోయాడు ,కోహ్లీ కూడా వెంటనే ఔట్ అవ్వడం గమనార్హం,అజాజ్ పటేల్ వేసిన ఓవర్లోనే పుజారా మరియు కోహ్లీ ఇద్దరు కాతా తెరవకుండానే వెనుతిరుగడం అభిమానులను చాలా నిరాశపరిచింది. తరువాత వచ్చిన శ్రేయస్ కాసేపే ఉన్నాడు. అజాజ్ పటేల్ మాత్రం తన బౌలింగ్ తో  టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ లనుపెవిలియన్ చేర్చాడు.మొదటి రోజు కోల్పోయిన 4 వికెట్లను  తన ఖాతాలోనే వేసుకున్నాడు.ఇక అగర్వాల్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ ను గట్టు ఎక్కించాడు,తన 4వ టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకొని స్కోర్ ను ముందుకు వెళ్లేలా ఆదుకున్నాడు.ఇక మొదటి రోజు ఆట ముగిసేసరికి ఇండియా 221/4 తో అగర్వాల్ 120  మరియు సహా 25 తో గ్రీసులో ఉన్నారు.మరి రేపు న్యూజిలాండ్ బ్యాటింగ్ కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారత్ ఎంత స్కోర్ చేయగలుగుతారో చూడాల్సిందే.

Kenna, Hyderabad

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*