
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన తాజా సినిమా అఖండ ఈనెల 2 న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.అయితే ఈ సినిమా ప్రజలని బాగా ఆకట్టుకొంటుంది.దాదాపు కోవిడ్ తరువాత వచ్చిన పెద్ద సినిమా అఖండ నే.రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటివరకు థియేటర్లు ఫుల్ అవ్వడం సినిమా పరిశ్రమ కి కూడా మంచి విషయమే అని చెప్పుకోవాలి.
బాలయ్య మరియు బోయపాటి కాంబినేషన్ అంటే పక్కా మాస్ చిత్రంగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే, వాళ్ళిద్దరి కలియకలో వచ్చిన రెండు సినిమాలు సింహ, లెజెండ్ ఎంత బ్రహ్మాండమైన విజయం సాదించాయో చెప్పనక్కర్లేదు. అఖండ తో హ్యట్రీక్ హిట్ సాధించి నిరూపించారు, అఖండ చిత్రం మాత్రం మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది అని అంటున్నారు ముఖ్యంగా థమన్ అందించిన మ్యూజిక్ మాత్రం సినిమా కి చాలా ప్లస్ అయింది.
అఖండ తరువాత ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాలు పుష్ప మరియు ఆర్ఆర్ఆర్ కూడా అదే తరహాలో విజయం సాధిస్తాయి అని అభిమానులు ఇంక సినీ వర్గ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Kenna, Hyderabad
Be the first to comment