
యువతా… ఆగండి ఆలోచించండి, మోజులోపడి మోసపోకండి…
డేటింగ్ యాప్స్ ఇది ఒకరకమైన దందా అని చెప్పుకోవచ్చు.ఇంటర్నెట్ విప్లవంలో మంచితోపాటు చెడును తీసుకోచింది. హ్యాకింగ్, పోర్నోగ్రఫీ,ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్. యువతే ప్రధాన లక్షంగా చేసుకొని వారిని ఈ ఊబిలోకి లాగుతున్నారు.ఈ వలలో పడి మోసపోయిన వారిలో 18 నుండి 40 ఏళ్ల వరకు వయస్సు ఉన్నవారు ఉన్నారు.
ఎప్పటినుండో వీటి గురించి చర్చ వస్తున్నా సైబర్ క్రైమ్ పోలీస్ వాల్ల గుట్టు రట్టు చేస్తూ ,తగిన కౌన్సిలింగ్ ఇస్తున్నా పూర్తి స్థాయిలో బ్యాన్ అనేది ప్రభుత్వం నుండి లేదు.ఇంటర్నెట్ లో సామజిక మాధ్యమాల్లో ఎక్కడపడితే అక్కడ ఈ యాడ్స్ మనకు దర్శనమిస్తాయి. ఈ యాప్స్ తో యువతను ఎరవేసి మోసం చేచేస్తున్నారు.ఒక్క క్లిక్ చేస్తే చాలు ఇక అంతే సంగతులు, వాటికి బానిసలుగా చేసుకోవక్డంతో పాటు ఆర్థికంగా నష్టం,వివాహేతర సంబంధం,విడాకుల వరకు తీసుకెళ్తుంది.
ఏంటి ఈ యాప్స్: మొదట సామాజిక మాధ్యమాల్లో అక్కడక్కడ యాడ్స్ రువురంలో అందమైన యువతుల ఫోటోలను పెట్టి ఆకర్షిస్తారు. అవి డౌన్లోడ్ అయ్యాక వారి నుండి మెస్సేజ్ రావడం ప్రారంభం అవుతుంది.వాటికి రిప్లై ఇవ్వబోతే రిచార్జి చేసుకోవలంటుంది. అది చేసాక కాల్స్ రావడం జరుగుతుంది.అవి లిఫ్ట్ చేయబోతే వీడియో కాల్ కి ఇంత, ఆడియో కాల్ కి ఇంత అని ప్యాకేజీ డబ్బులు చెల్లించాలి అని కనిపిస్తుంది.ఇవన్నీ చేయగా జేబులు కాస్త ఖాళీ అయ్యి, అప్పుడు తెలుస్తుంది జరగాల్సింది అంత జరిగిపోయింది ఇదంతా ఫ్రాడ్ అని.
ఇచ్చిన బయో డేటా ని పట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తు డబ్బు గుంజిన సంఘటనలు లేకపోలేదు.
ఇలా చాలామంది మోసపోయి పోలీసులను ఆశ్రయించారు.దీనిపై ప్రభుత్వం ఇకనుండైన పూర్తి స్థాయి అవగాహన కల్పించి, ఒక నిఘాను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుని యువతను తప్పుడు దారిన పోకుండా చూడవలసిన భాద్యత ఉంది.
K.Bharath(rachana college)
Be the first to comment