నరేందర్ రేవెల్లి జాతీయ మీడియా ఫెలోషిప్స్ కి  దరఖాస్తులకు ఆహ్వానం

తురగా ఫౌండేషన్ – హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులకు   జాతీయ మీడియా ఫెలోషిప్స్

తురగా ఫౌండేషన్,  విశ్వవిద్యాలయం కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో యువ జర్నలిస్టులకు పరిశోధనతో కూడిన ప్రత్యేక కథనాలు రాసేందుకు/వీడియో కథనాలు రూపొందించేందుకు ఫెలోషిప్ ఇవ్వబడుతుంది.

ఫెలోషిప్ కి ఎంపికైన జర్నలిస్టులు “మహమ్మారి అనంతర పరిస్థితి” అన్న విస్తృత ఇతివృత్తంలో వలసలు, జీవనోపాధి, జెండర్, ప్రజారోగ్య వ్యవస్థలు, వాక్సినేషన్, గ్రామీణ అర్థ వ్యవస్థ  వంటి ఉప అంశాలపై లోతైన పరిశోధనతో కూడిన కథనాలను రాయవలసి ఉంటుంది.

ప్రముఖ జర్నలిస్ట్ నరేందర్ రేవెల్లి స్మృతిలో ఇచ్చే ఈ ఫెలోషిప్ కి దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీ డిసెంబర్ 20, 2021. ఇంగ్లీష్ తెలుగు మీడియాలో (ప్రింట్  ఎలక్ట్రానిక్ వెబ్ మీడియా) పని చేసే 40 సంవత్సరాల లోపు జర్నలిస్టులు ఈ ఫెలోషిప్ కి అర్హులు. మూడు నెలల కాలంలో రెండు స్పెషల్ స్టోరీస్/వీడియో స్టోరీస్ ఈ ఫెలోషిప్ కింద ప్రచురణ/ప్రసారం చేయవలసి ఉంటుంది.

ప్రముఖ జర్నలిస్టులు, విద్యావేత్తలతో కూడిన జ్యూరీ దరఖాస్తులను  పరిశీలిస్తుంది.

మరిన్ని వివరాలకు:  Webpage of the Department of Communication of SN School, University of
Hyderabad

 https://snschool.uohyd.ac.in/comm/nr-media-fellowship/

నాణ్యమైన, మంచి పరిశోధనతో కూడి, కరోనా మహమ్మారికి సంబంధించి అవిదితంగా ఉండే అంశాలను వెలికి తీసుకువచ్చే సృజనాత్మక మీడియా కథనాల  ప్రచురణ జరిగేలా చూడడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*