జోష్ ఫుల్ గా సాగిపోతున్న ‘పల్లె ముచ్చట్లు’ టీమ్ తో చిట్ చాట్.

ఏదయినా సాధించాలనే తపన
తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఆశయం
వారితో యూట్యూబ్ ఛానల్ పెట్టించింది.
పల్లెల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలే కథా వస్తువుగా
తెలంగాణ యాసలో
నవ్వుల పంచ్ ల హోరులో
జోష్ ఫుల్ గా సాగిపోతున్న ‘పల్లె ముచ్చట్లు’ టీమ్ తో చిట్ చాట్.

సతీష్ రేణికుంట, డైరెక్టర్ – పల్లె ముచ్చట్లు


మాది కరీంనగర్ జిల్లా ఎండపెల్లి గ్రామం. చిన్నప్పటి నుండి కళలు అంటే ప్రాణం. మొదట్లో పెయింటింగ్ చేసేవాడిని ఆ తర్వాత ఫోటోగ్రఫీపై ఇంటరెస్ట్ పెరిగింది. ఎప్పుడూ ఎవ్వరి దగ్గర ఏమీ నేర్చుకోలేదు, సొంతంగా అన్నీ తెలుసుకునేందుకు ప్రయత్నించే వాడిని. అలా కొన్నిరోజులకి కంప్యూటర్ కొని సొంతంగా వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. అప్పట్లో కొండగట్టు మీద డాక్యుమెంటరీ తీశా.

హైదరాబాద్ జెమిని టీవిలో వీడియో ఎడిటర్ గా ఉద్యోగం రావడం, అప్పుడే తొలిసారి మా పల్లె దాటి పట్నానికి రావడం. అక్కడే మా రైటర్ మంజీత తో పరిచయం. మీడియాలో చాలా ఏళ్ళు పనిచేసా, tv9, ntv… కానీ మనసులో ఏదో చేయాలనే ఓ బలమైన ఫీలింగ్.

అప్పుడు పుట్టిందే ‘పల్లె ముచ్చట్లు’ యూట్యూబ్ ఛానల్. అప్పటికే ఎన్నో యూట్యూబ్ చానెల్స్ ఊళ్లపై కామెడీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాయి. కానీ మిగతా వారిలా బూతులు, డబల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఫ్యామిలీ అందరూ కలసి ఎంజాయ్ చేసే విధంగా షార్ట్ ఫిల్మ్స్ తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నా స్నేహితుడు కిరణ్ కి ఇదే విషయం చెప్పగా సరేనన్నాడు. అతడు యాక్టింగ్ నేను డైరెక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. ప్రదీప్ రెడ్డి అన్న సాయంతో… కొందరు ఫ్రెండ్స్ ని యాక్టింగ్ కి ఒప్పించాను. మీడియా మిత్రుడు మురళీ కథ అందించగా జూలై 1, 2020 న మొదటి షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసాం. ఆ తర్వాత కొన్ని కథలను మిత్రురాలు భవాని అందించారు. మాకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా యాక్టర్స్ పెరిగారు. రామ్ బోగ మాకో పెద్ద బలం. మంచి కామెడీ టైమింగ్ ఉండడం మాకు ప్లస్ అయింది. ఈ జర్నీలో శ్రీధర్, మధు, ఇష్క్ సంతోష్, కుమారస్వామి, భూమాచారి, శ్రీనివాస్ ఇలా పాత మిత్రులంతా తమ యాక్టింగ్ టాలెంట్ తో అదరగొడుతున్నారు.

https://www.youtube.com/channel/UC0osI1SRiLUqws32gUEsA_w

ప్రియ అవిరెడ్డితో ఎన్నో కామెడీలు పండించినం.

శిరీషతో అల్లరిపిల్ల వెబ్సైటు సిరీస్ చేస్తే అది బంపర్ హిట్ అయింది.

ప్రియతో తీసిన ఎపిసోడ్స్ మంచి వ్యూస్ వచ్చాయి.

 

ప్రస్తుతం మల్లికార్జున్, ప్రియ అవిరెడ్డి, సుమన్ గౌడ్, అభిత, రవళి,అమూల్య వంటి సీనియర్ యాక్టర్లతో కూడా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాము. మంచి స్పందన వస్తోంది.

మా టీంలోకి మంజీత ఎంటరవ్వడం .. ఎన్నో కామెడీ ఎపిసోడ్స్ ఇవ్వడం … ఇక అప్పటి నుండి వెనుదిరిగి చూసుకోలేదు.

ఎప్పుడూ కామెడీ ట్రాక్ లో వెళ్లే మేము కొత్తగా ‘రైతు బతుకు పోరాటం ‘ అని అన్నదాతల కష్టాలపై ఒక షార్ట్ ఫిల్మ్ తీసాము. నా ఆలోచనకి మంజీత ఇచ్చిన స్టోరీ, మల్లికార్జున్, ప్రియ అవిరెడ్డి, రామ్ బోగ, మధు ఇలా అందరి నటనతో కొన్ని వేల మందిని ఏడిపించిన చిత్రం .. ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయని రైతు స్టోరీ అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పటి వరకు రైతు కష్టాలు,ఆకలి చావులు, ప్రభుత్వ సాయం కోరుతూ ఇలా ఎందరో ఫిల్మ్స్ చేసారు. కానీ మా కథలో రైతు బతకాలంటే సాటి మనుషులుగా మనం ఏం చేయాలో చూపించాం… ఇది నాకు ఎంతో తృప్తిని ఇచ్చిన చిత్రం. ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ వందలాది మెసేజెస్, కాల్స్ వస్తూనే ఉన్నాయి.

ఒక కథలో హీరోగా చేసిన వెంటనే మరో దాంట్లో చిన్న క్యారెక్టర్ చేయడానికి కూడా నా టీం వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. సో మా చిత్రాలకి కథనే బలం అని చెప్పాలి. షార్ట్ ఫిల్మ్ తీయాలనుకునే వారికి నేనిచ్చే సలహా ఒక్కటే…భూమి మీద అడుగు పెట్టడానికి 9 నెలలు ఎదురుచూశారు. మీకు పేరు, డబ్బు రావాలంటే కూడా అంతే ఓపికగా ఎదురుచూడాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. వ్యూస్ కోసం మన విలువలు వదులుకుని చెత్తను, బూతులను చూపించకండి.

 

నా పేరు పల్లె కిరణ్ కుమార్. చిన్నప్పుడు స్కూల్ స్టేజ్ పై చిన్న చిన్న డ్రామాలు చేస్తుండేవాడిని. అందరూ మెచ్చుకుంటుంటే సంతోషంగా అనిపించేది. కాలేజీలో కూడా నటించే అవకాశం వస్తే వదిలేవాడిని కాదు. యాక్టింగ్ పై విపరీతమైన ఆసక్తి పెరిగి, యూట్యూబ్లో నటించాలని ఆశపడ్డాను. కొంతమంది యూట్యూబ్ చానెల్స్ వారికి ఫోన్లు చేసినా… మెసేజెస్ పెట్టినా రెస్పాన్స్ రాలేదు. నేనెందుకు వేరేవారిపై ఆధారపడాలి అని అనుకుంటుండగా…సతీష్ అన్న కలిశారు. ఇద్దరికి యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆశయం వుండడంతో చేతులు కలిపాము. వల్గారిటీ లేకుండా నవ్వించడమే టార్గెట్ గా మా ‘పల్లె ముచ్చట్లు’స్టార్ట్ అయింది.

ప్రదీప్ అన్న, శ్రీధర్ అన్న, నా చిన్ననాటి మిత్రుడు బొగ రాము అందరం కలిసి మంచి మంచి వీడియోస్ తో మీ అందరినీ అనుకున్నట్టుగానే నవ్విస్తున్నాం.

మా స్టోరీ రైటర్ మంజీత గారు కొత్త కొత్త కథలతో… మాకు మంచి మంచి రోల్స్ ఇస్తూ చాలా బాగా కథలు రాస్తున్నారు. నటనలో కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినా సతీష్ అన్న ఇచ్చే ప్రోత్సాహం కూడా సూపర్.

నాకు బాగా నచ్చిన వీడియోస్… పెళ్లి చూపుల్లో పిస బిత్తిరి వేషాలు, నాటలెయ్య రమ్మంటే నాశనం చేసిండు.

భవిష్యత్తులో కూడా మా వీడియోలను, మమ్మల్ని మరింత ఆదరించాలని కోరుకుంటున్నాను.

 

రామ్ బోగ

హాయ్ నా పేరు రామ్ బోగ. చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే పిచ్చి. జగిత్యాల సరస్వతి శిశుమందిర్ లో చదువుకునే రోజుల్లో చిన్న చిన్న నాటకాలు వేసేవాడిని. ఎప్పటికైనా సినిమా యాక్టర్ కావాలని, వెండి తెరపై కనిపించాలని ఆశ మనసులో బలంగా ఉండేది. అనుకోకుండా నా చిన్ననాటి మిత్రుడు పల్లెకిరణ్ నాకు ‘పల్లె ముచ్చట్లు’ గురించి చెప్పడం, నేను ఓకే అనడం జరిగిపోయాయి. ‘పల్లె ముచ్చట్లు’ డైరెక్టర్ సతీషన్న, ప్రదీపన్న, శ్రీధరన్నల ప్రోత్సాహంతో మరోసారి నటుడిగా నా టాలెంట్ ను చూపించే అవకాశం వచ్చింది.

నాకంటూ ప్రత్యేక గుర్తింపునిస్తూ, ఎన్నో క్యారెక్టర్స్ నాతో చేయించి మంచి పేరు తెచ్చిపెట్టారు మా డైరెక్టర్ సతీష్ రేణికుంటగారు.

మా రైటర్ మంజీత కుమార్ గారు నాకు చిత్ర విచిత్ర సంభాషణలు రాస్తూ కొత్త కొత్త క్యారెక్టర్స్ సృష్టిస్తూ నన్ను మరింత ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ధన్యవాదాలు.

నాకు తృప్తినిచ్చిన షార్ట్ ఫిల్మ్, నా తొలి ఫిల్మ్
‘కొంపముంచిన గూగుల్ పే’ నాకు మంచి పేరు తెచ్చింది.

వెండి తెరపై నన్ను నేను చూసుకోవాలన్న కోరిక కూడా త్వరలోనే తీరబోతోంది.నా ఫార్మసీ మిత్రుడు అమ్మ వేణు…తన మిత్రుడు అజయ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సంపూర్ణేష్ బాబు గారి మూవీ (సోదర)లో నాకో చిన్న సీన్ లో నటించే అవకాశం ఇచ్చారు. మీ అందరి ఆధారాభిమానాలు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.

నమస్తే నా పేరు శ్రీమతి మంజీత కుమార్. డైరెక్టర్ సతీష్, నేను జెమిని టీవిలో కలసి పనిచేసాం. అప్పటినుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారిపోయాం. మే 2021లో పల్లె ముచ్చట్లు కోసం రైటర్స్ కావాలని చూస్తున్నారు. నేనూ చాలామందికి ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేశా. ఎందుకో సడెన్ గా నేనే ఎందుకు ట్రై చేయకూడదు అని ఒక స్టోరీ రాసి పంపాను. సతీష్ సూపర్బ్ అని మెసేజ్ చేయగానే లేని కాలర్ ఎగరేసేసా. అలా మొదలై ఇప్పటికి దాదాపు 100 కథలదాకా అందించాను.

చిన్నప్పటి నుంచి నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. సాహితీ రంగంలో ఎన్నో హాస్య కథలు, హాస్య కవితలు రాసి విజేతగా నిలిచాను. ఇప్పుడు అదే ట్రాక్ లో కామెడీ షార్ట్ ఫిల్మ్స్ రాయడం ఎంతో సంతోషంగా ఉంది.

కేవలం కామెడీ మాత్రమే కాకుండా తెలుగు భాష గొప్పదనాన్ని తెలిపే ఎన్నో కథలు రాసాను. సామెతలు, పొడుపు కథలు ఇలా.

 

‘పల్లె ముచ్చట్లు’ హిట్ తో నాకు వేరే యూట్యూబ్ చానెల్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ వ్యూస్ కోసం వల్గర్ కంటెంట్ ఇవ్వని ఈ ఛానల్ కోసమే పనిచేయాలని నిశ్చయించుకున్నాను.

 

 

ఎప్పుడూ నాతో కామెడీ పండించే డైరెక్టర్ గారు రైతులపై మంచి స్టోరీ కావాలని అడిగారు. అదే ‘రైతు బతుకు పోరాటం’. “కథ చదువుతుంటేనే కన్నీళ్లు వచ్చాయి” అని టీమ్ రిప్లై ఇవ్వడం నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. అనుకున్నట్టుగానే ఆ కథకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

https://youtu.be/RpOT_-hybw8

నేను రాసే ప్రతీ కథను అందంగా తెరకెక్కించే డైరెక్టర్ గారికి, అద్భుత హాస్యం పండించే రామ్ గారికి, టీమ్ కి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు.

https://youtu.be/2zIm-36igiE 

 

డైరెక్టర్ సతీష్ కుమార్తె కృతి కైవల్య లీడ్ గా ‘అమ్ములుతో అంత ఈజీ కాదు’ యూట్యూబ్ ఛానల్ కూడా పిల్లలు, పెద్దలను ఆకట్టుకుంటోంది. అమ్ము చేసే అల్లరి కూడా మస్తు నవ్విస్తోంది. అక్కగా ప్రియ నటించడం ఒక ప్లస్.

https://www.youtube.com/c/Ammulu

ఈ ఛానల్ కి కూడా ‘పల్లె ముచ్చట్లు’ రైటర్ మంజీత కుమార్ గారే కథలు అందించడం గమనార్హం.

ఈ ‘పల్లె ముచ్చట్లు’ టీమ్ ఇలాగే తెలంగాణ యాసలో మరింత హాస్యాన్ని అందించాలని కోరుతోంది ఈక్షణం.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*