తెలంగాణ లో మారుతున్న రాజకీయాలు

తెలంగాణ రాష్ట్రం లోని రాజకీయ పరిణామాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.మీరా మేమా అనే విధంగా రోజురోజుకి వివిధ రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అందులో భాగంగా బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ గా  ప్రజలకి కనపడేలా బలంగానే ప్రయత్నిస్తోంది.వారు చేపట్టే ప్రతి కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా జాగ్రత్త పడుతోంది  జరిగేది ఎంత చిన్నదైనా లేదా పెద్ద కార్యక్రమం అయిన సరే ఇతర రాష్ట్రాలకు సంబందించిన  బీజేపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు మినిస్టర్లు సైతం తెలంగాణకి రావడం ప్రచారం చేయడం లాంటివి ఎంతో ఆసక్తిని రేపుతోంది. జరిగిన ఉపఎన్నికల్లో తమదైన శైలిలో విజయాన్ని అందుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈసారి అధికారం మాదే అనే ధీమాలో పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు ఉన్నారు.

మరో వైపు కొత్త అధ్యక్షుడిగా కాంగ్రెస్ హైకమాండ్  రేవంత్ రెడ్డి పేరుని ప్రకటించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల జోష్  మాత్రం అంత ఇంత కాదు. ఇక అధికార పార్టీకి  బలమైన ప్రత్యర్థిగా చెక్ పెట్టేది హస్తం పార్టీనే అని చాలా ఊహాగానాలు వినిపించాయి, కానీ మళ్ళీ అదే తరహాలో గ్రూప్ రాజకీయాలు మాత్రం ఏమీ మారలేదు, ఎవరి దారి వాళ్లదే అనే విధంగా ఉండడం,పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం దీని వల్ల కార్యకర్తల్లో కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ముఖ్యంగా కొందరు సీనియర్లు చాలా అసహనంగ ఉండడం మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, సొంతంగా ఇష్టం వచ్చినట్టు రేవంత్ వ్యవహరిస్తున్నాడు అని హైకమాండ్ కు లేఖలు రాయటం వంటివి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది.ఇది ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న కాస్త విశ్వాసం  కూడా  ప్రజలల్లో పోతుంది అనేది వాస్తవం.

ఇలా  బీజేపీ పార్టీ బలంగా కనపడడం వెనుక  అధికార పార్టీ  హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ లో పూర్తిగా భూస్థాపితం చేయడం కోసమే టీఆరెస్  బీజేపీ కి సహకరిస్తుంది  అనుకోవడం తో పాటు టీఆరెస్,బీజేపీ రెండూ పార్టీలు ఒకే తోవకు చెందినవి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే విధంగా వీళ్ళ వ్యవహారం ఉంది అని కొందరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

వరుసగా రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న అధికార పార్టీ టీఆరెస్ వైపు మాత్రం తీవ్ర వైఫల్యాలు వెలువడుతున్నాయి.ఉద్యోగుల బదిలీలు,రైతుల ధర్నాలు  ఆత్మ హత్యలు ఇలా ఎన్నో విమర్శలకు పాలుపడుతోంది మరియు మొన్నటికి మొన్న సొంత పార్టీ ఎమ్మెల్యే కొడుకు పైనే ఎన్నో ఆరోపణలు ఎదురుకోవడం పై ప్రజలు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు మాత్రం క్రియాశీలఖంగా ఉండబోతున్నాయి అనేది ముందుగానే కనపడుతుంది,రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాల్సిందే.

-G Kenna, Hyderabad

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*