రామకృష్ణ మఠంలో ఘనంగా జాతీయ యువజన దినోత్సవాలు

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో రెండు రోజుల పాటు హైబ్రీడ్ పద్ధతిలో జాతీయ యువజన దినోత్సవాలను, స్వామి వివేకానంద 159వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి జ్ఞానాదానంద, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద, చండీగఢ్ రామకృష్ణ మిషన్ స్వామి అనుపమానంద, లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్, డెక్స్‌టెరిటీ వ్యవస్థాపకులు శరద్ సాగర్ తదితరులు ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించారు. స్వామి వివేకానంద బోధనలు యువతకే కాదు యావత్ మానవాళికి అనుసరణీయమైనవని వక్తలు చెప్పారు. స్వామి వివేకానంద చూపిన బాటలో నడిచి జీవితాల్ని చరితార్థం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత సమయంలో వివేకానంద బోధనల ప్రాధాన్యతను వీఐహెచ్‌ఈ‌ డైరక్టర్ స్వామి బోధమయానంద వివరించారు.

నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రామకృష్ణ మఠానికి వచ్చిన శాండ్ ఆర్టిస్ట్ మనోజ్ కుమార్ వీఐహెచ్‌ఈ‌ ఆడిటోరియంలో ఫిబ్రవరి 13కు మద్దతుగా అద్భుతమైన ఆర్ట్ వేశారు. స్వామి వివేకానంద హైదరాబాద్‌లో పర్యటించి సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ప్రసంగించిన ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలని మనోజ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా స్వామి బోధమయానంద మనోజ్ కుమార్‌ను సత్కరించారు. ఉత్సవాల్లో భాగంగా భజనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*