
మళ్ళీ మొదలైన సినిమా సందడి గత నెలలో కారోన కారణంగా వాయిదా పడిన పెద్ద సినిమాలు మళ్ళీ విడుదల అవ్వడానికి సిద్ధం అయ్యాయి వాటిలో మూడు పెద్ద సినిమాలు విడుదల తేదీని ప్రకటించాయి,అందులో ప్రధానంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన సినిమా “ఆర్ఆర్ఆర్” రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటిస్తున్నారు,నిజానికి ఈ సినిమా జనవరి నెల 7వ తేదీన రావాలి కానీ కారోన వల్ల పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్చి25 న రిలీజ్ కాబోతుంది అని చిత్ర బృందం ప్రకటించింది.
మరోవైపు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29 వ తేదీన విడుదల తేదీని ఖరారు చేశారు,అనుకున్న దానికంటే ముందుగా రావాల్సిన ఈ సినిమా “ఆర్ఆర్ఆర్” కారణంగా ఒక నెల ఆలస్యంగా విడుదల కాబోతుంది.
ఇక దాంతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న పవన్ కళ్యాణ్ ,రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా కూడా విడుదల అవుతోంది ముందుగా ప్రకటించినట్టు ఫిబ్రవరి25 వ తేదీన లేక ఏప్రిల్1 న విడుదల చేస్తాము అనీ పరిస్థితి ని బట్టి రెండు తేదీల్లో ఎదో ఒకరోజు విడుదల చేయడానికి సిధ్ధంగా ఉన్నారు.
మరి బాక్సఫీసు కలెక్షన్లు ఏ తరహాలో ఉంటాయో చూడాలి.
– G Kenna, Hyderabad
Be the first to comment