రామానుజాచార్య విగ్రహావిష్కరణ సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: సమతామూర్తి రామానుజాచార్య విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్దార్ పటేల్, డాక్టర్ అంబేద్కర్‌ను గుర్తు చేసుకున్నారు.  సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీతో దేశంలో ఐక్యతా ప్రమాణం పునరావృతమైందని, రామానుజాచార్యుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీతో సమానత్వ సందేశం అందుతోందన్నారు. ప్రగతిశీలత, ప్రాచీనతలో భేదం లేదని రామానుజాచార్యను చూస్తే తెలుస్తుందని, మూఢ విశ్వాసాలను తొలగించేందుకు రామానుజాచార్యులు ఆనాడే కృషి చేశారని ప్రధాని చెప్పారు.

 

వెయ్యేళ్ల క్రితమే రామానుజుడు దళితులను కలుపుకుని ముందుకు సాగారని, ఆలయాల్లో దళితులకు దర్శనభాగ్యం కల్పించారని మోదీ చెప్పారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కూడా రామానుజాచార్య ప్రవచనాలనే చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. అందరికీ సమానావకాశాలు దక్కాలని, అందరూ సమానంగా అభివృద్ధి చెందాలని మోదీ అన్నారు. శతాబ్దాలుగా అణచివేతకు గురైనవారు పూర్తి గౌరవంతో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మోదీ కాంక్షించారు. ఎలాంటి భేదబావం లేకుండా సామాజిక న్యాయం, ప్రతి ఒక్కరూ పొందాలన్నారు. నేడు మారుతున్న భారతదేశం దీని కోసం ఐక్యంగా కృషి చేస్తోందని ప్రధాని చెప్పారు. దేశ ఏకతకు రామానుజాచార్య స్ఫూర్తి అని, రామానుజ బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని మోదీ చెప్పారు.

అంతకు ముందు త్రిదండి చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ శ్రీరాముడిలాగే మోదీ కూడా గుణ సంపన్నుడని కీర్తించారు. ప్రధాని మోదీ అయ్యాకే తాము హిందువులమని గర్వంగా చెప్పుకుంటున్నారని, భరతమాత తలెత్తుకుని చిరునవ్వులు చిందిస్తోందని చిన్నజీయర్ అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*