సీఎం జగన్‌ సన్నిహితుడికి శ్రీశైలం దేవస్థానం కమిటీలో చోటు

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న అనంతపురం జిల్లా వాసి ఒంటెద్దు మధుసూదనరెడ్డికి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం కమిటీలో చోటు దక్కింది. పెద్దపప్పూరు మండలం చీమవాగులపల్లికి చెందిన మధుసూదనరెడ్డి ఆధ్యాత్మిక రంగంలో అనేక ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ఈయన ఎంపికపై అనంత ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిలో అనంత వాసులను భాగస్వాములను చేస్తానని మధుసూదనరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆధ్యాత్మికరంగానికి చేస్తున్న కృషి పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తిస్తానని మధుసూదన్ రెడ్డి తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*