లండన్‌లో కన్నుల పండువగా భారత గణతంత్ర దినోత్సవాలు

లండన్‌: ఇంగ్లాండ్ రాజధాని లండన్‌‌లో భారత గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సెలెన్స్(ఐసీసీఆర్), నెహ్రూ సెంటర్, భారత్ హైకమిషన్, భారతీయ విద్యాభవన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంస్కృతి దర్శయామి పేరిట జరిగిన ఈ వేడుకల్లో భారత్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన జానపద నాట్యరీతులు, గేయాలను కళాకారులు ప్రదర్శించారు. మథురి(తెలంగాణ), షాండోల్(లఢఖ్), గబర్(చత్తీస్‌గఢ్), నిషి(అరుణాచల్ ప్రదేశ్), రభా(అసోమ్) నాట్యరీతులను దాదాపు 60 మంది కళాకారులు ప్రదర్శించారు.

జాతీయ గేయంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో.. అరుణాచల్ ప్రదేశ్, అసోం ముఖ్యమంత్రుల శుభాకాంక్షల సందేశాలున్న బుక్‌లెట్‌లను పంచిపెట్టారు. భారత హైకమిషనర్ గాయత్రీ ఇసార్, ఐసీసీఆర్ ప్రెసిడెంట్ డా. వినయ్ సహస్రబుద్ధే, నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి చేసిన వీడియో సందేశాలను ప్రదర్శించారు. కాగా.. ఈ కార్యక్రమం రూపకల్పనలో భాగస్వాములైన రాగసుధా వింజమూరి వోట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రసంగంతో వేడుకలు ముగిశాయి.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*