స్వామి వివేకానంద బోధనల్లో ఆచరణాత్మకత ఎక్కువ: జస్టిస్ రాధారాణి

హైదరాబాద్: స్వామి వివేకానంద బోధనల్లో ఆచరణాత్మకత ఎక్కువని తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి డాక్టర్ రాధారాణి చెప్పారు. 1893 ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో స్వామి వివేకానంద ప్రసంగించిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వామి వివేకానంద బోధనలతో రూపొందించిన మై కాల్ టు ద నేషన్ పుస్తకంలోని పలు అంశాలపై ఆమె ప్రసంగించారు. చిన్న పుస్తకంలోనే ఎన్నో విలువైన విషయాలున్నాయన్నారు. స్వామి వివేకానంద చికాగో వెళ్లే ముందు భాగ్య నగరంలో పర్యటించడం గొప్ప విషయమని రాధారాణి చెప్పారు.  వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద భాగ్యనగర పర్యటన విషయాలను వివరించారు. ఫిబ్రవరి 13ను తెలంగాణ ప్రభుత్వం వివేకానంద డే గా గుర్తించాలని కోరారు.  అనంతరం సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ స్వామి వివేకానంద బోధనల్లో ఏడు అంశాలపై ప్రసంగించారు. గురుభక్తి, దైవభక్తి, మాతృభక్తి, సేవ, మహిళలపట్ల దైవీ భావన తదితర అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో మెహబూబ్ కాలేజీ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి నరేశ్ కుమార్ యాదవ్, రామకృష్ణ మఠం వాలంటీర్లు, భక్తులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*