తానా మెచ్చిన కవయిత్రి మంజీత కుమార్

“తానా మెచ్చిన కవయిత్రి మంజీత కుమార్”

న్యూయార్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలనుు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై  ప్రతిష్ఠాత్మకంగా “అంతర్జాతీయ కవితల పోటీలు” నిర్వహించింది. ఈ పోటీకి ఈక్షణం ఫీచర్స్ ఎడిటర్ మంజీత కుమార్ ఎంపికయ్యారు. ఏప్రిల్ 22, 23, 24 తేదీలలో జూమ్ లో  తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద మంజీత తమ కవితను వినిపించబోతున్నారు.

దేశానికి వెన్నెముకగా భావించే అన్నదాతలను అందరూ గుర్తించి గౌరవించాలని, వారే ‘భవిష్యత్ సారథులని’ మంజీత అక్షరార్చన చేసిన కవిత ఈ పోటీకి ఎంపికయింది.

ఇంతటి విశేషమైన కార్యక్రమానికి తనను ఎంపిక చేసినందుకు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్‌కు మంజీత ధన్యవాదాలు తెలిపారు.

చిరు పదాలతో, మనసుకు హత్తుకునేలా కవితలు రాసే మంజీత గతంలో రెండుసార్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులను, వంశీ గ్లోబల్ అవార్డును సొంతం చేసుకున్నారు. హాస్య కవితలు, కథలు రాయడంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికి 200పైగా కవితలు, 100 వరకూ కథలు రాశారు. సాహిత్య కళానిధి బిరుదు, గాథా సృజన సంయమి పురస్కారం, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సేవా పురస్కారం, అక్షర క్రాంతి పురస్కారంతోపాటు పలు సాహితీ సంస్థల నుంచి పురస్కారాలు, ప్రశంసా పత్రాలు, సన్మానాలు అందుకున్నారు. ఎన్నో వార్తా పత్రికలు, వార మాస పత్రికలలో మంజీత రచనలు ప్రచురితమయ్యాయి. పలు రేడియోలు, యూట్యూబ్ ఛానెల్స్ లో వీరి కథలు, కవితలను చదివి వినిపించారు.

వృత్తి రీత్యా జర్నలిస్ట్ అయిన మంజీత పలు తెలుగు టీవి ఛానెల్స్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేసారు. దశాబ్ద కాలంపాటు ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్, రేడియో జాకీగా చేశారు. ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్స్ కి కథలు, మాటలు అందిస్తున్నారు.

అనేకమంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే ఈ “తానా కవితాలహరి” కార్యక్రమం తానా అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్ ఛానల్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. “యప్ టీవీ” ద్వారా అమెరికాతో  పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఈ టీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు మరియు ఇతర మాధ్యమాలలో ప్రసారం కానుంది.

“తానా ప్రపంచ సాహిత్య వేదిక ”
( ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం )

35వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం
( ఏప్రిల్ 22, 23, 2022, శుక్రవారం, శనివారం, భారతకాలమానం: 7:30 pm – అమెరికా: 7 am PST; 9am CST; 10 am EST;
ఏప్రిల్ 24, 2022, ఆదివారం, భారతకాలమానం: 8:30 pm – అమెరికా: 8 am PST; 10 am CST; 11 am EST;)
“కవితాలహరి”

ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:

1. TANA TV Channel – in YuppTV
2. Facebook: https://www.facebook.com/TANAsocial
3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
4. https://youtube.com/teluguone
5. www.youtube.com/tvasiatelugu
6. www.youtube.com/manatv
7. https://www.etvbharat.com/telugu/andhra-pradesh
8. https://www.etvbharat.com/telugu/telangana

మిగిలిన వివరాలకు: www.tana.org

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*