హైదరాబాద్ వైఎస్ఎస్ ధ్యానకేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

www.eekshanam.com హైదరాబాద్ వైఎస్ఎస్ ధ్యానకేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: బేగంపేట చికోటీ గార్డెన్స్‌లోని యోగదా సత్సంగ సొసైటీ ధ్యానకేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులకు, సాధనా మార్గంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వారికి స్వామి అచ్యుతానంద ఆన్‌లైన్ ద్వారా మార్గనిర్దేశనం చేశారు. ధ్యానం ప్రాధాన్యతను తెలియజెప్పడంతో పాటు ఆరంభంలో ఉన్నవారు ధ్యానానికి ముందు తీసుకోదగ్గ జాగ్రత్తలు వివరించారు. ధ్యానానికి ముందుగా శారీరకంగా, మానసికంగా ఎలా సంసిద్ధులు కావాలో తెలిపారు. శరీరాన్ని, మనసును సంసిద్ధం చేసుకోవడంలో శ్వాస పాత్రను వివరించారు. భక్తులతో శ్వాసకు సంబంధించిన ప్రక్రియలు చేయించారు. శ్వాస తీసుకోవడం, నిలుపుదల చేయడం, వదిలిపెట్టడం వంటి విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.                   అంతకుముందు భజన కార్యక్రమం స్వామి అమేయానంద ఆధ్వర్యంలో జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా వైఎస్ఎస్ వ్యవస్థాపకులు పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ పుస్తకంపై 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. వైఎస్ఎస్ ద్వారా ప్రచురింపబడిన ఇతర పుస్తకాలపై 25 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతం కావడంపై వైఎస్ఎస్ హైదరాబాద్ ధ్యానకేంద్ర కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.    మరింత సమాచారం కోసం: yssi.org

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*