ఈ నెల 28 వరకూ దుండిగల్‌‌లో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి

హైదరాబాద్: కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ నెల 28 వరకూ హైదరాబాద్ దుండిగల్‌‌లోని శ్రీ మహా విద్యాపీఠంలో బస చేస్తారు. భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకూ భక్తులకు దర్శనమిస్తారని శ్రీ మహా విద్యాపీఠం నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్రతిరోజూ ఉదయం పది నుంచి జరిగే భిక్షావందనం, పాదపూజల్లో భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. ఈ నెల 24న శుక్రవారం విశేష పూజ ఉంటుందని అలాగే ఈ నెల 26న ప్రదోష పూజ ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.

ఈ నెల 28 తర్వాత విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బయలుదేరతారు. జగ్గయ్యపేటలోని శ్రీ గురుధామ్ బలుసుపాడులో 5 రోజులు, ఏలూరు పవర్‌పేట లోని శ్రీ కంచికామకోటి పీఠ హేళపురి సంస్కృత వేద సమర్థ ప్రయోగ పాఠశాల భవనంలో 2 రోజులు, సామర్లకోటలోని గణపతి శాస్త్రి నివాసంతో పాటు, పెద్దాపురం ప్లీడర్స్ వీధిలోని ఎం శ్రీనివాసరావు నివాసంలో 5 రోజులుంటారు. జులై 10 నుంచి కాకినాడలోని చాగంటి కోటేశ్వరరావు గారికి చెందిన ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో బస చేస్తారు. జులై 13వ తేదీన వ్యాస పూజ అనంతరం చాతుర్మాస్య దీక్ష చేపడతారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*