
www.eekshanam.com యోగా లైఫ్లో భాగం కావాలి: యోగా ట్రైనర్ కమల మనోహరి
హైదరాబాద్: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ సింగర్, యోగా ట్రైనర్ కమల మనోహరి తన యోగా సెంటర్ లో యోగా డే జరుపుకున్నారు.ఈ సందర్భంగా కమల మాట్లాడుతూ యోగా అనేది లైఫ్ లో భాగం కావాలన్నారు. కేవలం స్పెషల్ డేస్ అప్పుడు ఫోటోస్ దిగి స్టేటస్ పెట్టుకోకుండా, మన లైఫ్ లో ప్రతి రోజూ కనీసం 1 గంట సేపు యోగా మీద మన ధ్యాస పెడితే…మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. అంతేకాదు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని చెప్పారు. బిజీ లైఫ్ అయినా యోగా మిస్ చేయకుండా ఉంటే ఇదే మన ఆస్తి అవుతుందన్నారు.
Be the first to comment