నందమూరి హరికృష్ణ మృతిపై చంద్రబాబు, కేసీఆర్, జగన్ దిగ్భ్రాంతి.. నాగార్జున షాక్

నల్గొండ: ప్రముఖ నటుడు, టీడీపీ రాజ్యసభ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైంది. ఎన్టీఆర్ వాహనం చైతన్యరథానికి హరికృష్ణ డ్రైవర్‌గా వ్యవహరించారు. శ్రీకృష్ణావతారం చిత్రంలో బాలనటుడిగా నట ప్రస్థానం మొదలు పెట్టారు. బాలనటుడిగా శ్రీకృష్ణావతారం, తల్లా పెళ్లామాలో నటించారు. తాతమ్మకల, శ్రీరాములయ్య, సీతారామరాజు, లాహిరిలాహిరిలాహిరి, శివరామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, స్వామి, శ్రావణమాసం చిత్రాల్లో నటించారు. దాన వీర శూర కర్ణ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.

నెల్లూరు జిల్లా కావలిలో నందమూరి అభిమాని మోహన్ కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు నందమూరి హరికృష్ణ ఉదయం 4.30కి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపైకి రాగానే ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్ర గాయం కావడంతో హరికృష్ణను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. తొలుత బ్రెయిన్‌డెడ్ అని వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత హరికృష్ణ కన్నుమూశారని వెల్లడించారు.

నందమూరి హరికృష్ణ చనిపోయారని తెలిసి షాక్‌కు గురయ్యానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. హరికృష్ణ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ, రాజకీయల్లో హరికృష్ణ సేవలు మరవలేనివని కేసీఆర్ చెప్పారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరికృష్ణ మృతిపై వైసీపీ అధినేత జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

 

చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు అని ఇటీవలే అన్నారని నాగార్జున గుర్తు చేసుకున్నారు. మిస్ యూ అంటూ ట్వీట్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*