కేంద్ర మంత్రి కన్నుమూత.. శోకసంద్రంలో బీజేపీ

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ ఈ తెల్లవారుజామున రెండు గంటలకు కన్నుమూశారు. కర్నాటక రాజధాని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన కేన్సర్‌తో పోరాడుతున్నారు. కొద్దిరోజులుగా ఆయన బెంగళూరు ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నారు. దక్షిణ బెంగళూరు ఎంపీగా ఉన్న ఆయన ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 59 సంవత్సరాల అనంత్‌కు మార్‌కు భార్య తేజస్విని, కుమార్తెలు ఐశ్వర్య, విజేత ఉన్నారు.

అనంత్ కుమార్ మరణంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. తాను ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అనంత్ కుమార్ భార్య, పిల్లలతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు.

 

 

 

కేంద్ర కేబినెట్‌లో ఆయన సహచరులు కూడా అనంత్ కుమార్ అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా…  అనంత్ కుమార్ మరణంపై సంతాపం వెలిబుచ్చారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్… అనంత్ అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు. అనంత్ మరణం దేశానికి తీరని లోటన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా అనంత్ కుమార్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంత్ తనకు చిరకాల మిత్రుడంటూ ట్వీట్ చేశారు.

అనంత్ మరణంతో బెంగళూరు మూగబోయింది. మూడు రోజులు సంతాపదినాలుగా పాటించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. నేడు సెలవుదినంగా ప్రకటించింది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*