మెగా విశ్వరూపం.. అదిరిపోయిన సైరా టీజర్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు సైరా టీజర్‌ను విడుదల చేస్తామని చెప్పిన చిత్ర బృందం అనుకున్న విధంగానే టీజర్‌ను విడుదల చేసింది. ఫ్యాన్స్‌ కళ్లను తిప్పుకోనీయకుండా చేసింది. టీజర్‌లో మెగాస్టార్ నట విశ్వరూపం చూపించారు. రోమాలు నిక్కబొడుచుకునేలా టీజర్‌లో చిరూ అదరగొట్టాడు.

తమ్ముడు పవర్‌స్టార్ వాయిస్ ఓవర్‌తో మొదలై సైరా నరసింహారెడ్డి గొప్పదనం, ఆంగ్లేయులతో ఆ వీరుడి పోరాట సన్నివేశాలను చూపించారు. చరిత్రపుటల్లో కనుమరుగైన వీరుడు, ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరీ మోగించిన సింహం అంటూ కథను సూచనప్రాయంగా తెలియజేశారు. కొణిదల ప్రొడక్షన్స్‌లో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ “సైరా నరసింహారెడ్డి” సినిమాను నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

(సర్‌ప్రైజ్.. సైరా నరసింహారెడ్డిలో రజనీకాంత్, మోహన్‌లాల్!)

అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, నయనతారా, తమన్నా, జగపతి బాబులను కూడా ఈ టీజర్‌లో చూపించారు. యుద్ధ సన్నివేశాలు చాలా బాగున్నాయి. సినిమా ఎలా ఉండబోతోందో స్పష్టంగా చూపించారు. ఈ మూవీ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున విడుదల కాబోతోంది. ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.

 

 

(విజయ్ కుమార్)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*