సక్షం సేవలకు సెల్యూట్

హైదరాబాద్: స్వచ్ఛంద సంస్థ సక్షం ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రిలో మూగ, చెవుడు సమస్యలున్న పిల్లలకు ఉచితంగా వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. పిల్లల తల్లితండ్రులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా సక్షం జాతీయ ఉపాధ్యక్షులు, ప్రణవ్ ఫౌండర్ డైరెక్టర్ కాశీనాధ్ లక్కరాజు Kasinaadh Lakkaraju మాట్లాడుతూ నిలోఫర్ ఆసుపత్రిలోని ప్రణవ్‌లో 2018 జులై నుంచి మొదలుపెట్టి 2021 సెప్టెంబర్ వరకు 29 వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ క్రాలేటి మాట్లాడుతూ అక్టోబర్ 1,2,3 తేదీల్లో పూణే నుంచి ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ అవినాశ్ వస్తారని, వినికిడి, మాట సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారని చెప్పారు.

నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ కృష్ణ మాట్లాడుతూ పిల్లలకు వినికిడితో పాటు మాట తెప్పించే ప్రక్రియ నిలోఫర్ ఆసుపత్రిలో జరగడం సంతోషకరమంటూ సక్షం, ప్రణవ్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ లక్ష్మి సమీరా (ENT సర్జన్), డాక్టర్ విజయ సారధి (నిమ్స్ న్యూరో సర్జరీ హ్H.O.D), డాక్టర్ విజయ్ బండికట్ల (సక్షం తెలంగాణ ఉపాధ్యక్షులు), డాక్టర్ అలిమేలు (నియోనాటల్ H.O.D), డాక్టర్ హిమబిందు సింగ్ (నియోనాటల్ ప్రొఫెసర్), డాక్టర్ స్వప్న( నియోనాటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్) తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*