
Eekshanam Exclusive: పేట కాంగ్రెస్‌లో కొత్త కూటమి..
నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: సూర్యాపేట కాంగ్రెస్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మరణానంతరం ఆయన రాజకీయ వారసత్వంపై మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. దామన్న కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆయనకు గతంలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పటేల్ రమేష్‌రెడ్డి ఇప్పుడు అండగా…




