Breaking News: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు..

హైదరాబాద్ ఈ క్షణం, అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో పాలనా యంత్రాంగంలో ప్రభుత్వం మరోసారి భారీ మార్పులు చేపట్టింది. రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేస్తూ, కొందరికి అదనపు బాధ్యతలు (FAC) అప్పగిస్తూ సీఎస్ సంజాయ్ జాజూ బుధవారం అధికారిక ఉత్తర్వులు (G.O.Rt.No.1553) జారీ చేశారు. రాష్ట్ర పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వం సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది.

  1. శ్రీ జయేష్ రంజన్, IAS (1992): పురపాలక, పట్టణాభివృద్ధి (HMDA పరిధి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఈయన్ను పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ (EFS & T) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. దీనితో పాటు ఈపీటీఆర్‌ఐ (EPTRI) డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు.
  2. శ్రీ వికాస్ రాజ్, IAS (1992): రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఈయన్ను ఇంధన (Energy) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
  3. శ్రీమతి ఎ. వాణి ప్రసాద్, IAS (1995): యవజన వికాస, పర్యాటక, సాంస్కృతిక (YAT&C) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఈమెకు క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) కల్పించారు.
  4. శ్రీ నవీన్ మిట్టల్, IAS (1996): ఈయన్ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి (PR & RD), ఆర్‌డబ్ల్యూఎస్ (RWS & RSAD) శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.
  5. శ్రీమతి శైలజా రామయ్యర్, IAS (1997): రెవెన్యూ (దేవాదాయ) శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమితులయ్యారు.
  6. శ్రీ రాహుల్ బొజ్జా, IAS (2000): రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయన్ను గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా (FAC) నియమించారు. బీసీ సంక్షేమ శాఖ బాధ్యతల్లో కూడా కొనసాగుతారు.
  7. శ్రీ ఇలంబరితి కె., IAS (2005): రవాణా, రహదారులు, భవనాల (R&B) శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే రవాణా శాఖ కమిషనర్, పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి (FAC)గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
  8. శ్రీ సర్ఫరాజ్ అహ్మద్, IAS (2009): హెచ్ఎండీఏ (HMDA) మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న ఈయన్ను మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శిగా మరియు జిహెచ్‌ఎమ్‌సి, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల స్పెషల్ ఆఫీసర్‌గా పూర్తి అదనపు బాధ్యతల్లో (FAC) నియమించారు.
  9. శ్రీమతి శృతి ఓజా, IAS (2013): మహిళా, శిశు సంక్షేమ, వికలాంగుల (WCD & SC) శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పోస్టింగ్ పొందారు.
  10. శ్రీ మహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూకీ, IAS (2014): తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఛైర్మన్ & ఎండీగా ఉన్న ఈయన్ను హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూనే, రైతు పవర్ కంపెనీ జెన్కో ఎండీగా పూర్తి బాధ్యతల్లో ఉంచారు.
  11. డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, IAS (2015): డబ్ల్యూసిడి & ఎస్సి డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
  12. శ్రీ జితేష్ వి పటిల్, IAS (2016): TGSPDCL ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈయనను టీజీఆర్‌ఈడీసీఓ (TGREDCO) వైస్ ఛైర్మన్ & ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలలో నియమించారు.

సచివాలయంలో పరిపాలనా విధానాన్ని పటిష్టం చేసేందుకే ప్రభుత్వం ఈ నియామకాలను చేపట్టినట్లు తెలుస్తోంది.