
Breaking News: SIR నోటీసులు వస్తే ఆఫీసులకు వెళ్లక్కర్లేదు: కేంద్ర ఎన్నికల సంఘం
- ఓటర్ల ఇళ్ల వద్దకే BLOలు..
- ERO/AERO కార్యాలయాల్లో వ్యక్తిగత విచారణల రద్దు..
- ఫాం-6తో డిక్లరేషన్ తప్పనిసరి చేస్తూ ECI నూతన ఉత్తర్వులు..
హైదరాబాద్, ఈ క్షణం: ప్రత్యేక సమాగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియకు సంబంధించి దేశవ్యాప్తంగా ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చింది. SIR నోటీసులు అందుకున్న పౌరులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అధికారులు జారీ చేసే నోటీసుల ఆధారంగా వ్యక్తిగత విచారణ కోసం ERO లేదా AERO కార్యాలయాలకు స్వయంగా వెళ్లాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.
సవరణల పేరుతో ఓటర్లను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పకూడదనే ఉద్దేశంతో ఈ ప్రజానుకూల నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఇళ్ల వద్దకే వచ్చి డాక్యుమెంట్ల పరిశీలన!
నూతన విధివిధానాల ప్రకారం.. నోటీసులు పొందిన ఓటర్లు బిఎల్వో (Booth Level Officer – BLO)లను ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం కూడా ఉండదు.
ఈసీఐ (ECI) ప్రకటనలోని ముఖ్యాంశాలు:
ఇంటింటికీ BLOల రాక: నోటీసు అందిన ఓటర్ల ఇళ్లకు బిఎల్వోలే స్వయంగా వెళ్తారు. లబ్ధిదారుల సమాచారాన్ని, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అక్కడ నుంచే పరిశీలిస్తారు.
ECINet లో అప్‌లోడ్: సేకరించిన పత్రాలను బిఎల్వోలు నేరుగా ECINet / BLONet మొబైల్ యాప్‌లో డిజిటల్‌గా అప్‌లోడ్ చేస్తారు.
ఆఫీసుల్లో విచారణ రద్దు: ERO (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) లేదా AERO (అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) ఆఫీసుల్లో ఓటర్లకు ఎలాంటి నేరుగా (Personal Hearing) హాజరుకావాల్సిన అవసరం ఉండదు.
కొత్త ఓటు కోసం డిక్లరేషన్ ఫామ్ తప్పనిసరి..
ఇదే సమయంలో SIR ప్రక్రియ కొనసాగుతుండగా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఎన్నికల సంఘం ఒక నిబంధనను జోడించింది. కొత్తగా ఓటరు నమోదు (Fresh Voter Registration) కోసం ఫాం-6 (Form-6) సమర్పించే అభ్యర్థులు తమ వివరాలు సరైనవేనని ధ్రువీకరిస్తూ ఒక ‘డిక్లరేషన్’ (Declaration Form) ను అటాచ్ చేయాల్సి ఉంటుందని సూచించింది. ఈ మార్పుల ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియ మరింత పారదర్శకంగా మారడమే కాకుండా, సాధారణ ప్రజలకు అనవసరమైన శ్రమ, ఇబ్బందులు తప్పుతాయని ఈసీ భావిస్తోంది.







