
CCTV Footagae: మిర్యాలగూడ ఆలగడప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
- అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై ప్రమాదం..
- యూటర్న్ తీసుకుంటున్న బైక్ను ఢీకొట్టిన అతివేగపు కారు..
- తీవ్రంగా గాయపడిన బైక్ చోదకుడు, ఆసుపత్రికి తరలింపు..
- సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు..
మిర్యాలగూడ / నల్గొండ ఈక్షణం, నవంబర్ 02: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని ఆలగడప గ్రామం వద్ద ప్రధాన రహదారిపై తీవ్ర దిగ్భ్రాంతికరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూటర్న్ తీసుకునేందుకు రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంతో దూసుకొచ్చిన ఒక కారు తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సమీపంలో అమర్చిన సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి.
సీసీటీవీ కెమెరాలో లభించిన దృశ్యాలు..
రోడ్డుపై యూటర్న్ తీసుకునే క్రమంలో నిబంధనల ప్రకారం బైక్ చోదకుడు వాహనాన్ని మళ్లిస్తుండగా, ఊహించని రీతిలో రహదారిపై విపరీతమైన వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి బైక్ను నేరుగా గుద్దింది. ఢీకొట్టిన తీవ్రతకు ద్విచక్ర వాహనదారుడు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘోర ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
రెస్క్యూ ఆపరేషన్ & కేసు నమోదు:
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, తోటి వాహనదారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రక్తమడుగులో ఉన్న బాధితుడిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి 108 అంబులెన్స్ ద్వారా తరలించారు.
సమాచారం అందుకున్న మిర్యాలగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించి దర్యాప్తు వేగవంతం చేశారు.






