
తాగునీటి వృథాపై జలమండలి కొరడా.. జూబ్లీహిల్స్లో రూ.5 వేల జరిమానా
హైదరాబాద్ ఈ క్షణం, అక్టోబర్ 29: నగరంలో తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ జలమండలి (HMWSSB) మరింత దూకుడు పెంచింది. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను తక్షణమే పరిగణలోకి తీసుకుంటూ, క్షేత్రస్థాయిలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలో తాగునీటిని వృథా చేసిన ఒక నివాస యజమానికి అధికారులు రూ. 5,000…




