జిల్లా వార్తలు

Nidamanoor Mudeemanikyam Nagarjuna Sagar Canal Accident Perla Sharath

Breaking News: నాగార్జునసాగర్ కాల్వలో పడి యువకుడు దుర్మరణం..

నిడమానూరు/మిర్యాలగూడ, ఈ క్షణం: బంధువులతో కలిసి సరదాగా విందు ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న ఒక యువకుడిని ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. నాగార్జునసాగర్ కాలువ వెంట బైక్‌పై ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో నీటిలో మునిగి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన నల్గొండ జిల్లా నిడమానూరు మండల…

Suryapet Crime News, Rash Driving Suryapet, Bike Stunts Suryapet Traffic Police, Telangana Road Safety

Video: సూర్యాపేటలో బైక్‌పై యువకుల వెకిలిచేష్టలు.. ప్రాణాలతో చెలగాటం..

సూర్యాపేట, ఈ క్షణం: సూర్యాపేట పట్టణంలో కొంతమంది యువకులు రోడ్లపై వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో బైక్‌లపై విన్యాసాలు (Bike Stunts), వెకిలిచేష్టలు చేస్తూ మిగతా ప్రయాణికులను, స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. తాజాగా సూర్యాపేట పట్టణ పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రోడ్డులో ఇద్దరు యువకులు చేసిన…

Kasipet Sandhya Suicide Mancherial Crime News Ganesh Visarjan

వినాయక నిమజ్జనంలో దారుణం.. భర్త వేరే మహిళతో డ్యాన్స్ చేశాడని నవవధువు ఆత్మహత్య..

మంచిర్యాల/కాసిపేట, ఏపీబీ న్యూస్: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఘోర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన వేడుకల్లో మద్యం మత్తులో భర్త చేసిన ఒక చిన్న పొరపాటు ఓ నవవధువు నిండు నూరేళ్ల జీవితాన్ని బలితీసుకుంది. భర్త అందరి ముందూ వేరే మహిళతో డ్యాన్స్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య, పురుగుల మందు…

Devarakadra MLA Madhusudhan Reddy Sand Mining, G Bhaskar Reddy, GMR

Breaking News: ఎమ్మెల్యే సోదరుడి ఇసుక దందా.. దేవరకద్రలో అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్న రైతులు

మహబూబ్‌నగర్/దేవరకద్ర, ఈ క్షణం: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ ఇసుక దందా తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, ఆయన సోదరుడి అండదండలతో వాగుల నుంచి విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారంటూ స్థానిక రైతులు రోడ్డెక్కారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకుని అధికారుల తీరుపై నిలదీశారు.…

Ganesh Chaturthi police guidelines and DJ ban in Telangana

Breaking News: గణేష్ నవరాత్రులు: డీజేలకు నో పర్మిషన్.. సోషల్ మీడియా పై ప్రత్యేక మానిటరింగ్: ఎస్పీ

నల్లగొండ, ఈ క్షణం: రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లు, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వినాయక మండపాల వద్ద కానీ, నిమజ్జన ఊరేగింపుల…

KTR at BRS Rythu Maha Dharna in Miryalaguda

మిర్యాలగూడలో రైతు గర్జన.. కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌ రైతు మహాధర్నా

మిర్యాలగూడ, ఈ క్షణం: కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించిన రైతు మహాధర్నాకు భారీ స్పందన లభించింది. ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ముఖ్య అతిథిగా హాజరై…

Breaking News: భగ్గుమన్న నల్గొండ.. బీజేపీ, కాంగ్రెస్ కోడిగుడ్లు, టమాటాలతో దాడులు

నల్లగొండ, ఈ క్షణం: హైదరాబాద్‌లో చోటుచేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఘర్షణల ప్రభావం నల్లగొండ జిల్లాకూ పాకింది. ఇరుపార్టీల శ్రేణులు పరస్పర నిరసనలు, దాడులకు దిగడంతో జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు నల్లగొండలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ…

6 ఏళ్ల కుమార్తెను నడుముకు కట్టుకొని బావిలో దూకి తల్లి ఆత్మహత్య..

మంచిర్యాల, ఈ క్షణం: భర్త వేధింపులు తాళలేక, పుట్టింటికి వచ్చినా మనశ్శాంతి కరువై ఓ కన్నతల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ల కడసారిన కూతురిని నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు మరియు…

Eekshanam Exclusive: నల్లగొండ జిల్లాలో మద్యం అమ్మకాలకు భారీ బ్రేక్‌..

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మద్యం విక్రయాలకు భారీ బ్రేక్‌ పడింది. సాధారణంగా పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలతో మద్యం అమ్మకాలు ఊపందుకునే ఆగస్టు నెలలో ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే.. ఈ ఏడాది ఆగస్టు తొలి 20 రోజుల్లోనే లిక్కర్‌, బీర్‌ విక్రయాల్లో భారీ…

Eekshanam Exclusive:నల్లగొండలో ముదిరిన ‘మెడికల్‌ కోల్డ్‌వార్‌’

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండలో ప్రైవేటు వైద్య రంగంలో పోటీ కొత్త మలుపు తిరుగుతోంది. ఒకప్పుడు వైద్యుల నైపుణ్యం, వైద్య సేవల నాణ్యత, అత్యాధునిక సదుపాయాలు, తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడంపైనే ఆసుపత్రుల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పేషెంట్‌ను ఎవరు తీసుకొస్తున్నారు?.. ఆ పేషెంట్‌ కోసం ఎంత ఖర్చు…