
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం.. నగర ట్రాఫిక్‌కు కీలక ముందడుగు
- రూ.620 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల ఫ్లైఓవర్..
- ఓపెన్‌టాప్ జీపులో ప్రయాణించి నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఈ క్షణం: నగరంలో కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్ మార్గంలో నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఫ్లైఓవర్ డిజైన్లకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను సీఎం పరిశీలించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్‌టాప్ జీపులో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పరిశీలించారు.
రూ.620 కోట్లతో 3.2 కిలోమీటర్ల నిర్మాణం
ఈ ఫ్లైఓవర్‌ను రూ.620 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించినట్లు అధికారులు తెలిపారు. చంచల్‌గూడ–సంతోష్‌నగర్ మార్గంలో రాకపోకలకు ఈ వంతెన కీలకంగా మారనుంది.

ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, వేం నరేందర్‌రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, కె. రఘువీర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలాతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధిలో ఈ ఫ్లైఓవర్ ఒక ముఖ్యమైన ప్రాజెక్టుగా నిలవనుంది.







