Nalgonda News

Komatireddy Venkat Reddy Palnadu Water Grid SLBC Brahmana Vellamla AMRP

Eekshanam Exclusive: మంత్రి కోమటిరెడ్డికి మళ్లీ జలపరీక్ష!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నల్లగొండ జిల్లా ప్రజలకు కృష్ణా జలాలు అందించాలన్న లక్ష్యంతో ఒకప్పుడు ఉద్యమించిన నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫ్లోరైడ్‌ మహమ్మారితో ప్రజలు అల్లాడుతున్న సమయంలో నాటి టీడీపీ ప్రభుత్వంపై పోరుబాట పట్టారు. అసెంబ్లీలో ఫ్లోరైడ్‌ నీళ్ల బాటిల్‌ చూపించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ నీరు తాగాలని డిమాండ్‌ చేశారు. ఆ…

Nagarjuna Sagar Irrigation Intelligence SE Mallikarjuna Rao Palnadu Project

Eekshanam Exclusive: ఇరిగేషన్‌ వర్సెస్‌ ఇంటెలిజెన్స్‌!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు తాగునీటి పథకం పనుల వ్యవహారం తెలంగాణలోని రెండు కీలక శాఖల మధ్య సమన్వయ లోపాన్ని తెరపైకి తెస్తోంది. సాగర్‌ ఇరిగేషన్‌ సర్కిల్‌, నల్లగొండ జిల్లా ఇంటెలిజెన్స్‌ విభాగం మధ్య సమాచార మార్పిడి సరిగా జరగడం లేదన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.…

Miryalaguda Illegal Constructions Road Encroachment No Pillars Building

Breaking News: అనుమతి అపార్ట్‌మెంట్‌కు.. నిర్మాణం హాస్పిటల్‌కు!

మిర్యాలగూడ,ఈక్షణం: పట్టణంలో అక్రమ నిర్మాణాల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. భవన నిర్మాణ అనుమతులు ఒక విధంగా తీసుకుంటూ.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అపార్ట్‌మెంట్ నిర్మాణం కోసం మున్సిపాలిటీ నుంచి అనుమతులు పొందినట్లు చెబుతున్న ఓ నిర్మాణదారుడు.. అందుకు భిన్నంగా హాస్పిటల్ నిర్మిస్తున్నారంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి…

Nagarjuna Sagar Intake Well Retired Engineers Shyam Prasad Reddy Tanneeru Venkatesham

సాగర్ బ్యాక్‌వాటర్‌లో ఏపీ సొరంగ పనులపై వివాదం.. రిటైర్డ్ ఇంజనీర్లు పరిశీలించి ఏమన్నారంటే..

నల్లగొండ / నాగార్జునసాగర్ ఈక్షణం: నాగార్జునసాగర్ జలాశయం బ్యాక్‌వాటర్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినట్లు చెబుతున్న ఇన్‌టేక్ వెల్, సొరంగ/సంపు నిర్మాణ పనులను తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కన్వీనర్ శ్యాం ప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం నేతృత్వంలోని బృందం సాగర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లి…

Nalgonda Bypass Probe Dr Nagam Varshith Reddy Nitin Gadkari NH 565

నల్గొండ బైపాస్‌ పనులపై స్వతంత్ర విచారణ జరిపించాలి: నాగం వర్షిత్‌ రెడ్డి

నల్లగొండ ఈక్షణం: ఎన్‌హెచ్‌-565 (NH-565) పరిధిలోని నకిరేకల్‌–నాగార్జునసాగర్‌ సెక్షన్‌లో రూ. 516.17 కోట్లతో చేపట్టిన 14 కిలోమీటర్ల నాలుగు వరుసల నల్గొండ బైపాస్‌ నిర్మాణ పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్‌ రెడ్డి ఆరోపించారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములు, జలవనరుల ప్రాంతాల్లో మట్టి తవ్వడం, రోడ్డు…

Nagarjuna Sagar 492 Feet Blasting Intake Well Uttam Kumar Reddy

Eekshanam Exclusive: అన్నీ వేళ్లూ.. ఉత్తమ్‌ వైపే!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నాగార్జునసాగర్‌ డ్యామ్‌ పరిధిలో ఏం జరుగుతోంది? జలాశయంలో 510 అడుగుల డెడ్‌ స్టోరేజీ స్థాయి ఉండగా.. దానికంటే దిగువన 492 అడుగుల వద్ద బ్లాస్టింగ్‌ చేస్తూ ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మిస్తున్నారనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. డ్యామ్‌ బయట నుంచి చూస్తే కనిపించని విధంగా లోపలి భాగంలోనే పనులు జరుగుతున్నాయనే…

Nalgonda Municipal Commissioner Vamsi Krishna Transfer Corporators

Eekshanam Exclusive: నల్లగొండ కార్పోరేటర్లు స్ట్రిక్ట్.. కమిషనర్‌ అవుట్‌!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కమిషనర్‌ వంశీకృష్ణ వ్యవహారశైలి మొదటి నుంచీ చర్చనీయాంశంగానే మారింది. నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించడం, రాజకీయ పైరవీలకు తలొగ్గకపోవడం, కార్యాలయ పరిపాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టడం వంటి నిర్ణయాలు ఒకవైపు ప్రశంసలు అందుకోగా.. మరోవైపు పాలకవర్గంలోని కొందరు కార్పొరేటర్లకు అసంతృప్తి కలిగించాయి. కార్పొరేటర్ల సిఫారసులకు సైతం…

Nagarjuna Sagar Water Drawing 493 Feet KRMB Andhra Pradesh Telangana

Eekshanam Exclusive: సాగర్‌పై సగం పెత్తనం.. జలాలపై పూర్తి కన్ను!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నాగార్జునసాగర్‌ జలాశయంపై తెలంగాణ నియంత్రణకు గతంలోనే గండి పడింది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాగర్‌ డ్యామ్‌ గేట్ల నిర్వహణ బాధ్యతలను ఏపీ, తెలంగాణకు చెరిసగం అప్పగించడంతో ప్రాజెక్టుపై పూర్తి పర్యవేక్షణ కోల్పోవాల్సి వచ్చింది. ఇదే అదనుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సాగర్‌ జలాలపై కన్నేసిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాలను పోతిరెడ్డిపాడు…

Nalgonda Ghat Roads Brahmangari Gutta Latheef Saheb Gutta Komatireddy Venkat Reddy

Eekshanam Exclusive: నీలగిరి కొండలకు ఘాట్‌ కళ

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నీలగిరి పట్టణానికి కొత్త అందాలు అద్దేలా.. కొండలపైకి సరికొత్త బాటలు పరుచుకుంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్‌ సాహెబ్‌ గుట్ట ఘాట్‌ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఒకవైపు బ్రహ్మంగారి గుట్టపైకి ఘాట్‌ రోడ్డు అందుబాటులోకి రావడంతో వాహనదారుల సందడి మొదలైంది.…

Miryalaguda Sand Bazaar Closed Illegal Sand Mafia

Eekshanam Exclusive: మిర్యాలగూడెంలో.. సాండ్‌ బజార్‌కు అధికార పార్టీ తాళం!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: సామాన్యులకు తక్కువ ధరకు ఇసుక అందించాలనే ప్రభుత్వ లక్ష్యం మిర్యాలగూడెంలో నీరుగారిపోయింది. అక్రమ ఇసుక వ్యాపారానికి అడ్డుకట్ట వేసి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఇసుకను అందించేందుకు ఏర్పాటు చేసిన సాండ్‌ బజార్‌కు తాళం పడింది. ప్రభుత్వం టన్ను ఇసుక వెయ్యి రూపాయాలకే సప్లై చేస్తుండటం తో…