Ekadhi Silver Jewellery: నెల్లూరులో సందడి చేసిన నిధి అగర్వాల్..

నెల్లూరు, ఆగస్టు 29, ఈ క్షణం: నెల్లూరు నగరంలోని ఆచారి వీధిలో ‘ఏకాధి సిల్వర్ జ్యువెలరీ’ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రారంభమైంది. సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై స్టోర్‌ను ప్రారంభించారు. నాణ్యమైన వెండి ఆభరణాలతో పాటు సంప్రదాయం, ఆధునికత కలగలిసిన వినూత్న డిజైన్లను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

స్టోర్ ప్రారంభోత్సవానికి నగర ప్రజలు, ఆభరణాల ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే పలు నగరాల్లో వినియోగదారుల ఆదరణ పొందిన ‘ఏకాధి’.. మరింత మంది కస్టమర్లకు ప్రత్యేక వెండి ఆభరణాల కలెక్షన్లను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నెల్లూరులో కొత్త స్టోర్‌ను ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఏకాధి డైరెక్టర్ వేణు రాచకొండ మాట్లాడుతూ.. ఆభరణాల ప్రియుల నుంచి లభిస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఏకాధిపై ప్రజలు చూపిస్తున్న ఆదరణ తమకు ఎంతో ఉత్సాహాన్నిస్తోందన్నారు. కొత్త స్టోర్‌ ఏర్పాటు కేవలం వ్యాపార విస్తరణ మాత్రమే కాదని.. అత్యుత్తమ కళా నైపుణ్యంతో రూపొందించిన వెండి ఆభరణాలను మరింత మందికి చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ప్రత్యేకమైన వెండి ఆభరణాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

ఏకాధి డైరెక్టర్ శివ్ చరణ్ వుప్పలంచి మాట్లాడుతూ.. పెళ్లికూతురి నుంచి గృహిణి వరకు, సహజమైన అందాన్ని ఇష్టపడే ప్రతి మహిళ అభిరుచికి అనుగుణంగా తమ బ్రాండ్‌ కలెక్షన్లను రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి కొత్త స్టోర్‌తో వినియోగదారుల వేడుకల్లో ‘ఏకాధి’ భాగస్వామిగా మారుతోందని పేర్కొన్నారు. సంప్రదాయ ఆభరణాల కళారీతులకు ఆధునిక డిజైన్లను జోడిస్తూ విభిన్నమైన కలెక్షన్లను అందిస్తున్నట్లు తెలిపారు.

నెల్లూరు ఫ్రాంచైజీ భాగస్వాములు వానరాసి గౌతమ్, కొండేటి సాయి కృష్ణ, యన్నారు వెంకటేష్ మాట్లాడుతూ.. అత్యుత్తమ వెండి ఆభరణాల కోసం ఏకాధి స్టోర్‌ను సందర్శించాలని నగర ప్రజలను కోరారు.

నెక్లెస్‌లు, హారాలు, చెవి దుద్దులు, గాజులు, బ్రాస్‌లెట్లు, ఉంగరాలు, జుంకాలు, లాకెట్లు తదితర విభిన్న రకాల వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పెళ్లిళ్లు, పండుగలు, ప్రత్యేక శుభకార్యాలతో పాటు రోజువారీ వినియోగానికి సరిపోయేలా ప్రత్యేక డిజైన్లను రూపొందించినట్లు చెప్పారు.

నెల్లూరు స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు.

  • రూ.10,000 కొనుగోలుపై ఫ్లాట్ రూ.1,000 తగ్గింపు
  • రూ.1 లక్ష కొనుగోలుపై రూ.25,000 గిఫ్ట్ ఓచర్
  • రూ.2 లక్షల కొనుగోలుపై రూ.60,000 గిఫ్ట్ ఓచర్
  • కనీసం రూ.5,000 కొనుగోలుపై ‘స్వర్ణ శ్రావణ’ ఆఫర్లు
  • రూ.10,000 కనీస కొనుగోలుపై ‘స్పిన్ ది వీల్’లో బంగారు నాణెం పొందే అవకాశం

ఈ ఆఫర్లు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 10, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

‘ఏకాధి సిల్వర్ జ్యువెలరీ’ ప్రారంభోత్సవానికి సినీ నటి నిధి అగర్వాల్ హాజరుకావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా ఆమె స్టోర్‌ను ప్రారంభించారు. అనంతరం బయటకు వచ్చి అభిమానులను పలకరించారు. పలువురితో సెల్ఫీలు దిగారు.

నిధి అగర్వాల్ రాకతో ఆచారి వీధి పరిసర ప్రాంతంలో సందడి నెలకొంది. ఆమెను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Leave a Reply