Selfie Video: హరిబాబు ను చంపింది నేనే: వైష్ణవి అన్న సంతోష్

నిజామాబాద్‌, సెప్టెంబర్ 18 (ఈ క్షణం): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరిబాబును ఆమె సోదరుడు సంతోష్ అత్యంత దారుణంగా నరికి చంపాడు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని రద్దీగా ఉండే ఆర్ ఆర్ చౌరస్తా (RR Chourasta) వద్ద ఈ సంఘటన జరగడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హరిబాబును హత్య చేసిన అనంతరం సంతోష్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లోంగిపోయాడు.

ఈ సంఘటనకు సంబంధించి సంతోష్ మరియు అతని భార్య విడుదల చేసిన సెల్ఫీ వీడియోల్లోని విషయాల సంక్షిప్త వివరాలు:

తన చెల్లి వైష్ణవికి జరిగిన అన్యాయానికి ప్రతికారంగానే హరిబాబును హత్య చేశానని సంతోష్ స్పష్టం చేశాడు.

చెల్లికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, తనకు ఎటువంటి శిక్ష పడకుండా ప్రజలందరూ సపోర్ట్ చేసి త్వరగా బయటకు తీసుకురావాలని వేడుకున్నాడు.

తన భర్త జైలుకు వెళ్లడంపై బాధగా ఉన్నప్పటికీ, వైష్ణవిని చంపిన వ్యక్తి అంతమయ్యాడనే ఆనందం కూడా ఉందని పేర్కొంది.

తన భర్త చేసిన పని సరియైనదా కాదా అని ప్రజలే చెప్పాలని, అతనికి మద్దతుగా నిలిచి బయటకు తీసుకురావడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్ ఆర్ చౌరస్తా వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Leave a Reply