Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

హైదరాబాద్: భార్య పుట్టినరోజు వేడుకలు జరిగిన రోజే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ కూకట్పల్లి దేవినగర్‌లో విషాదం నింపింది. భార్యకు చివరిగా పంపిన సందేశం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కొత్తగూడెం పట్టణానికి చెందిన ములుగురి రమేష్ (40) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ భార్య రాధికతో కలిసి కూకట్పల్లి దేవినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల రాధిక పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో వేడుకలు నిర్వహించారు.
వేడుకలు ముగిసిన అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి ట్యాంక్‌బండ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే రమేష్ మాత్రం తాను రావడం లేదని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాడు. దీంతో రాధిక తన అక్క, తమ్ముడితో కలిసి ట్యాంక్‌బండ్‌కు వెళ్లారు.
వారు బయటకు వెళ్లిన కొద్దిసేపటికే రమేష్ తన భార్య రాధిక ఫోన్‌కు “పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై” అంటూ సందేశం పంపినట్లు సమాచారం. ఆ మెసేజ్ చూసిన రాధిక తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి చేరుకుని చూడగా రమేష్ అప్పటికే మృతి చెంది కనిపించాడు. దీంతో ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. రమేష్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులను విచారిస్తున్నట్లు తెలిసింది.