Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల మార్పుపై జరుగుతున్న రాజకీయ చర్చలు కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ స్థానంలో తన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి అవకాశం కల్పించేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు ఢిల్లీలో అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారన్న ప్రచారం…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మద్యం విక్రయాలకు భారీ బ్రేక్ పడింది. సాధారణంగా పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలతో మద్యం అమ్మకాలు ఊపందుకునే ఆగస్టు నెలలో ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే.. ఈ ఏడాది ఆగస్టు తొలి 20 రోజుల్లోనే లిక్కర్, బీర్ విక్రయాల్లో భారీ…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్ జి. చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తాజా రాజకీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి కూడా అధిష్టానం తెలియజేసినట్లు సమాచారం.…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండలో ప్రైవేటు వైద్య రంగంలో పోటీ కొత్త మలుపు తిరుగుతోంది. ఒకప్పుడు వైద్యుల నైపుణ్యం, వైద్య సేవల నాణ్యత, అత్యాధునిక సదుపాయాలు, తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడంపైనే ఆసుపత్రుల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పేషెంట్‌ను ఎవరు తీసుకొస్తున్నారు?.. ఆ పేషెంట్ కోసం ఎంత ఖర్చు…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ అనుసరిస్తున్న వ్యూహంపై కొత్త చర్చ మొదలైంది. అధికార కాంగ్రెస్‌ను ఎదుర్కొనే క్రమంలో పార్టీ సొంత కార్యక్రమాలతో పాటు.. ఇతర ప్రతిపక్ష పార్టీలు చేపడుతున్న ప్రజా సమస్యల కార్యక్రమాల్లోనూ బీఆర్‌ఎస్ నేతలు కనిపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో చర్చకు తెరలేపారు. ఇప్పటివరకు ప్రభుత్వాలను, పార్టీలను, రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన ఆయన.. తాజాగా తన రాజకీయ దృష్టిని మరింత విస్తృతం చేసినట్లు కనిపిస్తోంది. “రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి నాకుంది.. నా నిజాయితీనే నా బలం”…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బాలింత మమత ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన వెనక ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం, భద్రతా వ్యవస్థ వైఫల్యం, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలే అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా గడువు ముగిసిన అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టును కొనసాగించడమే ఇలాంటి ఘటనలకు…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మరోసారి ‘ఆపరేషన్ ఆకర్ష్’ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ను రాజకీయంగా బలహీనపర్చే లక్ష్యంతో గతంలో అనుసరించిన వ్యూహాన్ని బీఆర్‌ఎస్ మరోసారి తెరపైకి తీసుకురావాలని చూస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దింపే దిశగా అడుగులు వేస్తుండగా, బీజేపీ మాత్రం బీసీ కార్డును ప్రయోగించే అవకాశాలపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.…