కేసీఆర్‌తో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ భేటీ

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 17: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సమావేశమైన కిశోర్, అధినేత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ కిశోర్ తో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజల సమస్యలు, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పనితీరు తదితర అంశాలపై అధినేత ఆరా తీసినట్లు సమాచారం.

KCR Gadari Kishore Kumar Meeting Erravelli Thungathurthi

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చేపడుతున్న పోరాటాల వివరాలను గాదరి కిశోర్ కుమార్ ఈ సందర్భంగా కేసీఆర్‌కు వివరించారు. పార్టీ కేడర్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, ప్రజా సమస్యలపై గళం విప్పాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.