Breaking News: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 12: తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 21 మంది ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ, పలువురికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు గురువారం (G.O.Rt.No.1654) ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ బదిలీల్లో భాగంగా అత్యంత కీలకమైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా (CP) మహేష్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా ఉన్న వి.సి. సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ (DG) గా ప్రభుత్వం బదిలీ చేసింది.

రాష్ట్రంలోని పలు కీలక విభాగాల అధిపతులను ప్రభుత్వం మార్చింది:

  • చారు సిన్హా (1996 బ్యాచ్): అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. సీఐడీ (CID) డీజీగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
  • డాక్టర్ సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్): జైళ్ల శాఖ డీజీ నుంచి మహిళా భద్రత, షీ టీమ్స్ మరియు భరోసా విభాగం డీజీపీగా బదిలీ అయ్యారు.
  • స్వాతి లక్రా (1995 బ్యాచ్): జైళ్ల శాఖ (Prisons & Correctional Services) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
  • డాక్టర్ అనిల్ కుమార్ (1996 బ్యాచ్): గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ డీజీపీగా ఉన్న ఈయనను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వైస్-చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
  • వై. నాగిరెడ్డి (1997 బ్యాచ్): పౌరసరఫరాల శాఖ (Civil Supplies) కమిషనర్‌గా నియమితులయ్యారు.
క్రమ సంఖ్యఅధికారి పేరు (బ్యాచ్)నూతన పోస్టింగ్ / బాధ్యతలు
1డా. సౌమ్య మిశ్రా (1994)డీజీపీ – ఉమెన్ సేఫ్టీ, షీ టీమ్స్ & భరోసా (అదనపు బాధ్యతలు: డీజీపీ ఆర్గనైజేషన్ & లీగల్)
2స్వాతి లక్రా (1995)డైరెక్టర్ జనరల్ – జైళ్ల శాఖ (అదనపు బాధ్యతలు: హోంగార్డ్స్ డీజీపీ)
3మహేష్ మురళీధర్ భగవత్ (1995)కమిషనర్ ఆఫ్ పోలీస్ (CP), హైదరాబాద్
4చారు సిన్హా (1996)డీజీ – ఏసీబీ (ACB) (అదనపు బాధ్యతలు: సీఐడీ డీజీపీ)
5డా. అనిల్ కుమార్ (1996)వీసీ & ఎండీ – టీజీఎస్ఆర్టీసీ (TGSRTC)
6వి.సి. సజ్జనార్ (1996)డీజీ – ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, సివిల్ డిఫెన్స్ (అదనపు బాధ్యతలు: ఎస్‌పీఎఫ్ డీజీ)
7వై. నాగిరెడ్డి (1997)కమిషనర్ – పౌరసరఫరాల శాఖ (Civil Supplies) & వీసీ ఎండీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్
8సంజయ్ కుమార్ జైన్ (1997)అదనపు బాధ్యతలు: ఏడీజీపీ (ట్రైనింగ్)
9విక్రమ్ సింగ్ మాన్ (1998)డీజీపీ (ఆపరేషన్స్), గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ (అదనపు బాధ్యతలు: పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్)
10ఎం. స్టీఫెన్ రవీంద్ర (1999)డైరెక్టర్ – తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ & రైల్ సేఫ్టీ బ్యూరో (TG-TMARS)
11అకున్ సబర్వాల్ (2001)ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్), తెలంగాణ (అదనపు బాధ్యతలు: కోఆర్డినేషన్ & టెక్నికల్ సర్వీసెస్)
12ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (2004)డైరెక్టర్ – అవినీతి నిరోధక శాఖ (ACB)
13కార్తికేయ (2006)ఐజీపీ – మల్టీ జోన్-1 (అదనపు బాధ్యతలు: డైరెక్టర్, ఐసీసీసీ – ICCC)
14కె. రమేష్ నాయుడు (2006)ఐజీపీ – రైల్వేస్
15డి. జోయల్ డేవిస్ (2010)జాయింట్ డైరెక్టర్ – రోడ్ సేఫ్టీ & ట్రాఫిక్, TG-TMARS (అదనపు బాధ్యతలు: హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ)
16జి. చందనా దీప్తి (2012)అదనపు బాధ్యతలు: డీఐజీ, జోన్-7, జోగులాంబ
17ఆర్. భాస్కరన్ (2012)అదనపు బాధ్యతలు: డీఐజీ (ఇంటెలిజెన్స్)
18కె. నారాయణ నాయక్ (2009)అదనపు బాధ్యతలు: డీఐజీ, జోన్-2, బాసర
19ఎల్.ఎస్. చౌహాన్ (2009)డీఐజీ – కోఆర్డినేషన్ (అదనపు బాధ్యతలు: డీఐజీ, జోన్-6, చార్మినార్)
20శ్రీ బాలా దేవి (SPS)డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) – TG-TMARS, హైదరాబాద్
21వి. అరవింద బాబు (SPS)డీసీపీ (SM&IT), హైదరాబాద్ సిటీ