బ్రేకింగ్ న్యూస్

Telangana IPS Officers Transfers List Mahesh Bhagwat New Hyderabad CP VC Sajjanar

Breaking News: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 12: తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 21 మంది ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ, పలువురికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు గురువారం (G.O.Rt.No.1654) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా అత్యంత…

Telangana Intermediate Education Scrapped Revanth Reddy 10 Plus 2 System

Breaking News: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా విధానం రద్దు

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 11: తెలంగాణ విద్యా వ్యవస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో దశాబ్దాలుగా అమలులో ఉన్న ప్రత్యేక ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (2027-28) నుంచి ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్య (School…

Peddavoora gurukul school incident

Video: నిడమనూరు ఘటన మరవకముందే పెద్దవూర పాఠశాలలో దారుణం..

నల్గొండ ఈక్షణం, నవంబర్ 11: నల్గొండ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో వరుసగా చోటుచేసుకుంటున్న దారుణాలు తీవ్ర అశాంతిని, ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. నిన్న నిడమనూరు మండలంలోని గురుకుల పాఠశాలలో కీచక పారిశుద్ధ్య కార్మికుడు మైనర్ బాలికలను వేధించిన ఘటన మరువక ముందే, ఈరోజు జిల్లాలోని పెద్దవూర గురుకుల పాఠశాలలో మరో ఘోర ఉదంతం వెలుగుచూసింది.…

Delimitation Suryapet Constituencies Uttam Jagadish Reddy Eekshanam

Eekshanam Exclusive: డీలిమిటేషన్‌.. నేతల సీట్లకు ఎసరు?

నల్లగొండ, ఈక్షణం ప్రతినిధి: నియోజకవర్గాల పునర్విభజనపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. కొత్త ఏడాది ఆరంభంలోనే డీలిమిటేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో నియోజకవర్గాల రిజర్వేషన్లలో మార్పులు జరిగితే కీలక నేతల రాజకీయ స్థానాలు తారుమారయ్యే అవకాశాలున్నాయనే చర్చ ప్రధాన…

Nagam Sridevi, Nagam Varshit Reddy, Nalgonda News, National Commission for Women, NCW India, Eekshanam

Breaking News: శ్రీదేవిపై దాడి ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ విచారణ

నల్గొండ, ఈ క్షణం: బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తల్లి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నాగం శ్రీదేవిపై దాడి జరిగినట్లు అందిన ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై వాస్తవాలను నిర్ధారించేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నవంబర్ 10న ఉత్తర్వులు…

Graduate MLC Voters List Telangana Nalgonda Khammam Warangal

Eekshanam Exclusive: గ్రాడ్యుయేట్‌ ఓటర్లు 6.70 లక్షలు!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో జరిగిన ఉప ఎన్నికలతో పోలిస్తే తాజాగా 2,06,568 మంది ఓటర్లు అదనంగా నమోదయ్యారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 6,70,4 07కు చేరింది. ఓటర్ల సంఖ్యలో భారీ పెరుగుదల రాజకీయ పార్టీల్లో ఆసక్తితో పాటు గుబులు రేపుతోంది. కొత్తగా నమోదైన…

Huzurnagar Municipality Sanitation Workers Pending Salaries PF Dues Commissioner

ఇంట్లో పని చేస్తేనే జీతాలిస్తారా.?

హుజూర్‌నగర్‌ ఈక్షణం, నవంబర్ 10: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో అధికారుల తీరుపై పారిశుద్ధ్య కామాటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం అధికారులను నిలదీస్తే.. అధికారులు మాత్రం వ్యక్తిగత పనులు చేయాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నెలలుగా తమకు జీతభత్యాలు…

Huzurnagar Municipality Congress Revolt Funds Issue

Breaking News: హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌లో తిరుగుబాటు!

హుజూర్‌నగర్‌, ఈక్షణం: హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. సొంత పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్‌ చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌ గౌడ్‌ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో సుమారు రూ.6 కోట్ల నిధుల వినియోగంపై లెక్కలు వెల్లడించాలని పట్టుబడుతూ మంగళవారం నిర్వహించిన…

Srisailam Left Bank Canal,SLBC Tunnel Works

Eekshanam Exclusive: ప్రమాదం తర్వాత.. మళ్లీ పరుగులు!

నల్లగొండ, ఈక్షణం ప్రతినిధి: శ్రీశైల సొరంగ మార్గంలో 2025, ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదం తర్వాత నిలిచిపోయిన ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం ఎడమగట్టు కాలువ) టన్నెల్‌ పనులు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. సవాళ్లను అధిగమిస్తూ సొరంగం తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గతంలో రోజుకు రెండు, మూడు మీటర్లు మాత్రమే జరిగే తవ్వకం పనులు..…

Pawan Kalyan, Anna Konidela, Anna Lezhneva, AP Deputy CM

Breaking News: పవన్ కళ్యాణ్ – అన్నా లెజ్నెవా విడాకుల ప్రకటన

అమరావతి ఈక్షణం, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక సంచలన మరియు కీలక ప్రకటన వెలువడింది. తన భార్య అన్నా కొణిదెల (అన్నా లెజ్నేవా)తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. 13 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఇద్దరూ పరస్పర…